బాలయ్య సెట్ లో 'జాంబీరెడ్డి' డైరెక్టర్ ఏం చేస్తున్నాడు?
TeluguStop.com
అ! సినిమాతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి మరియు జాంబీ రెడ్డి సినిమా లను తెరకెక్కించిన విషయం తెల్సిందే.
ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం హనుమాన్ అనే సూపర్ మ్యాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సమయంలోనే బాలయ్య సెట్ లో ప్రశాంత్ వర్మ కనిపించడం చర్చనీయాంశం అయ్యింది.
బాలయ్య ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయడం ఏంటా అంటూ అంతా నోరు వెళ్లబెడుతున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని కమర్షియల్ యాడ్స్ కూడా తెరకెక్కాయి.
బిగ్ బాస్ కోసం ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కమర్షియల్ యాడ్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
కమర్షియల్ యాడ్ చిత్రీకరణ కోసం ప్రస్తుతం అందరు కూడా ప్రశాంత్ వర్మను ఆశ్రయిస్తున్నారు.
బిబ్ బాస్ కమర్షియల్ యాడ్ మంచి సక్సెస్ ను దక్కించుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ దర్శకుడితోనే అంటే ప్రశాంత్ వర్మ తోనే ఆహా లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కోసం కూడా ప్రమోషన్ వీడియోను షూట్ చేయించారు.
ఈ ప్రోమోలతో ఖచ్చితంగా షో కు మంచి రేటింగ్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు.
పెద్ద ఎత్తు అంచనాలున్న ఈ టాక్ షో ను ఆహా లో దీపావళి నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
"""/"/ అందుకు గాను ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కమర్షియల్ షూట్ ను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా ఆహా వారు నిర్మించిన అన్ స్టాపబుల్ షో సెట్టింగ్ లో ప్రశాంత్ వర్మ యాడ్ లను చిత్రీకరించాడు.
రెండు లేదా మూడు ప్రోమోలను ఈ సందర్బంగా షూట్ చేశారు.వాటిని రెండు మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆహా అన్ స్టాపబుల్ తో పాటు అఖండ సినిమా తో కూడా బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
అల్లు అర్జున్ కంటే గొప్పగా ఎవరూ నటించలేరు.. పూనమ్ కౌర్ ఆసక్తికర పోస్ట్ వైరల్!