బాలయ్య సినిమాపై మైత్రి వారి నమ్మకం... వారికి ఇచ్చేందుకు నో
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తున్న సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసింది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత హోల్ సేల్ గా పంపిణీ చేసేందుకుగాను ప్రయత్నాలు చేశారు.
కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు అందుకు ఆసక్తి చూపించలేదట.కొన్ని ఏరియాల్లో తాము స్వయంగా విడుదల చేయడం తో పాటు కొన్ని ఏరియాల్లో సినిమా ను రిటైల్ గా అన్నట్లుగా స్థానిక డిస్ట్రబ్యూటర్ల కు ఇచ్చే విషయమై చర్చలు జరుపుతున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య మరియు గోపీచంద్ మలినేని సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ విడుదలకు ముందే కనీసం 10 కోట్ల వరకు లాభాలను దక్కించుకునేలా బిజినెస్ జరుగబోతుంది.
ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు.అదుగో ఇదుగో అంటూ సినిమా వార్తలు వస్తూనే ఉన్నాయి.
అప్పుడే సినిమా బిజినెస్ మొదలు అయ్యింది.అన్ని ఏరియాలో కూడా బాలయ్య అఖండ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది.
అందుకే ఈ సినిమా కూడా అదే తరహా లో సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యిందని.
సినిమా తో మాస్ అభిమానులను బాలయ్య ఊపేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. """/" /బాలయ్య 107 సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే.
సినిమా ను ఇదే ఏడాది చివరి వరకు విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
మరి ఏం జరుగబోతుంది అనేది తెలియాంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు మైత్రి మూవీస్ వారి నుండి వచ్చాయి.ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా బాలయ్య 107 సినిమా ను వారు ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
వీడియో వైరల్: బ్రేక్ డాన్యులతో స్వామి వారి ఊరేగింపు