బాలయ్య ఫ్యాన్స్‌ను బాలీవుడ్ విలన్ అంటూ భయపెడుతున్న బోయపాటి
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.
వచ్చే నెలాఖరుకు ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ చిత్రం పూర్తి కాకుండానే బాలయ్య తన తర్వాత చిత్రం అయిన 106వ సినిమాను కన్ఫర్మ్ చేశాడు.
ఇప్పటికే బాలయ్యతో రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య 106వ చిత్రం తెరకెక్కబోతుంది.
రికార్డు స్థాయిలో ఈ చిత్రం ఉండాలనే ఉద్దేశ్యంతో బోయపాటి చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు.
సింహా మరియు లెజెండ్ చిత్రాలను మించి ఉండేలా బాలయ్యతో ప్లాన్ చేస్తున్నాడు.బోయపాటి గత చిత్రం వినయ విధేయ రామ దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది.
ఆ సినిమాతో బోయపాటి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు.మెగా ఫ్యాన్స్ ఏకంగా అతడిని చంపేస్తామంటూ బెదిరించారు.
నందమూరి హీరోల వద్ద డబ్బులు తీసుకుని చరణ్‌కు డిజాస్టర్ ఇచ్చాడు అంటూ ఆరోపించారు.
అలాంటి నేపథ్యంలో బోయపాటి చేయబోతున్న సినిమా అవ్వడం వల్ల ఈ సినిమాపై అందరి దృష్టి ఉంది.
"""/"/తన గత సినిమా ఫలితంను మరిపించేలా ఈ చిత్రంను తీయబోతున్నాడు.ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను విలన్‌గా తీసుకు రాబోతున్నాడు.
వినయ విదేయ రామ చిత్రంకు బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్‌ను తీసుకు వచ్చిన బోయపాటి ఈసారి ఏకంగా సంజయ్ దత్‌ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి.
సంజయ్ దత్ వర్సెస్ బాలయ్య అంటే పరిస్థితి ఎలా ఉంటుందా అంటూ నందమూరి ఫ్యాన్స్ భయపడుతున్నారు.
వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ మూవీ వచ్చే అవకాశాలున్నాయట.
యూకే: ఈ గుడ్డు చాలా స్పెషల్.. అందుకే ఈ ధరకు అమ్ముడుపోయింది..?