బాలకృష్ణను పవన్ ఫాలో అయితే బెటర్.. అలా చేస్తే కెరీర్ బాగుంటుందంటూ?
TeluguStop.com
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ( Actor Balakrishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.
ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.
ఇకపోతే బాలయ్య బాబు గత మూడు సినిమాలు ఒకదానిని మించి ఒకటి సక్సెస్ ని సాధించిన విషయం తెలిసిందే.
వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ ను అందుకున్నారు.ఆ సంగతి పక్కన పెడితే.
తాజాగా సోషల్ మీడియాలో బాలకృష్ణను పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫాలో అయితే మేలు అనే వార్త వైరల్ గా మారింది.
"""/" /
మరి ఆ వివరాల్లోకి వెళితే.ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు రాజకీయాలు ఒక వైపు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రెండు వైపులా విజయాలను అందుకుంటున్నారు.
సినిమాలలో నటిస్తూనే ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ తాజాగా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎమ్మెల్యేగా చేస్తున్న బాలకృష్ణ సినిమాల మానేశారా అంటే అది లేదు.మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ మంచి విజయాలు అందుకుంటున్నారు.
ఒకటి రెండు కాదు దాదాపుగా పదేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.
తాజాగా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత కూడా ఎంచక్కా తన సినిమాల్ని కొనసాగిస్తున్నారు బాలయ్య.
ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే, బాలయ్య మాత్రం తన కొత్త సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్( Rajasthan ) వెళ్లారు.
"""/" /
అలా అని ఆయన రాజకీయాలకు దూరంగా జరగరు.కొన్ని రోజులు షూటింగ్ చేస్తారు, ఆ వెంటనే రాజకీయాల్లో మునిగిపోతారు.
దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు.సరిగ్గా ఇదే మైండ్ సెట్ ను పవన్ కల్యాణ్ కూడా అలవర్చుకోవాలంటున్నారు పవన్ ఫ్యాన్స్.
ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్యే, సీరియస్ గా సినిమాలు చేస్తుంటే, పవన్ ఎందుకు తన సినిమాల్ని పక్కనపెడుతున్నారనేది ఫ్యాన్స్ యొక్క ఆవేదన.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తూ సినిమాలలో నటించవచ్చు కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
కొత్త సినిమాలు ప్రకటించనక్కర్లేదు.ఒప్పుకున్న సినిమాలైనా పూర్తిచేయాలి కదా.
దర్శక నిర్మాతల్ని అలా వెయిటింగ్ లిస్ట్ లో పెడితే ఎలా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ సినిమాలపై దృష్టి పెడతారో లేదో.
యాబైవేల మందితో రైతు ఉద్యమానికి సిద్ధమవుతున్న కేటీఆర్ ?