నాని కోసమే కథ రాసుకున్న బలగం వేణు…అసలు మ్యాటరేంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి చాలా సినిమాలు చేశారు.

అందులో చాలామంది స్టార్ డైరెక్టర్లుగా మారితే మరి కొంతమంది మాత్రం ప్లాప్ డైరెక్టర్లు గా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయారు.

ఇక అలాంటి క్రమం లోనే కొంతమంది దర్శకులు చేసినవి తక్కువ సినిమాలే అయిన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

"""/" / ఇక అలాంటివాళ్లలో దర్శకుడు వేణు( Venu Yeldandi ) ఒకరు.

ఈయన చేసిన బలగం( Balagam) సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ అయింది.

ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాని చూసి సొంత ఇంట్లో ఎలాంటి పరిణామాలు అయితే ఎదురయ్యాయో అవన్నీ తనకు తాను ఓన్ చేసుకొని సినిమాని ఆదరించాడు.

అందువల్ల ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.ఇక ఇప్పుడు ఆయన నానిని హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు.

"""/" / అయితే వేణు ఈ కథ రాసుకున్నప్పుడు నానిని దృష్టిలో పెట్టుకొని ఒక కథని తయారు చేసుకున్నాడట.

ఇక ఇది కూడా ఒక పల్లెటూరు నేపథ్యంలో జరగబోయే కథగా దీన్ని రెఢీ చేస్తున్నాడు.

మరి ఈ సినిమాతో వేణు మరోసారి సూపర్ సక్సెస్ ని అందుకొని స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోతాడా లేదా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇక మొత్తానికైతే వేణు ఒక నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ప్రస్తుతం డైరెక్టర్ గా తన రేంజ్ ని విస్తరించుకున్నారనే చెప్పాలి.

ఇక ఇప్పుడు నాని సినిమాతో కనుక సూపర్ సక్సెస్ అందుకుంటే తను తప్పకుండా స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు వెలుగొందుతాడు అని చాలామంది అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

చూడాలి మరి వేణు ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్టు కొడతాడు అనేది.

బన్నీపై నాకెందుకు కోపం.. వాళ్లు నాతో తిరిగినవాళ్లే.. రేవంత్ రెడ్డి కామెంట్స్ వైరల్!