Director Venu : తండ్రి అయిన బలగం మూవీ డైరెక్టర్.. నెట్టింట పోస్ట్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్, డైరెక్టర్ వేణు( Director Venu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న వేణు వెండితెరపై కూడా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

అయితే జబర్దస్త్ షోతోనే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్నాడు వేణు.కాగా ఇటీవల బలగం( Balagam ) అనే సినిమాతో దర్శకుడిగా మరి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

"""/" / అంతేకాకుండా బలగం సినిమా పెద్ద హిట్ అవ్వడంతో అందరూ వేణుని అభినందించారు.

ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా దక్కడంతో ఎక్కడ చూసినా కూడా వేణు పేరు మారుమోగిపోయింది.

పెద్ద పెద్ద దర్శకులు సైతం వేణుని ప్రశంసించారు.ఇకపోతే అసలు విషయంలోకి వెళ్లితే.

తాజాగా తాను తండ్రి అయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు వేణు.తనకు పాప పుట్టింది అని తెలుపుతూ పాపని ఎత్తుకొని దిగిన ఫోటోని షేర్ చేశాడు.

దీంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు వేణుకి కంగ్రాట్స్ చెప్తున్నారు. """/" / ఇక వేణుకి ఇప్పటికే ఒక బాబు ఉండగా ఇప్పుడు పాప పుట్టింది.

దీంతో మహాలక్ష్మి పుట్టింది అదృష్టం ఇంకా పెరుగుతుంది మీరు మంచి స్థాయికి వెళ్తారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

బలగం సినిమాతో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వేణు రెండవ సినిమాను కూడా రూపొందించే పనిలో పడ్డారు.

దాంతో ఇప్పటికే వేణు రెండవ మూవీపై కూడా అంచనాలు పెరిగాయి.ఎలాంటి సినిమాను రూపొందిస్తున్నారు.

సినిమా ఎలా ఉండబోతోంది? అన్న క్యూరియాసిటీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మొదలైంది.

అద్భుతం, అడవి జంతువుకు దైవభక్తా.. శివలింగాన్ని హత్తుకున్న ఎలుగుబంటి వీడియో వైరల్!