పాటలు వద్దు, మరో జన్మ ఉంటే క్రికెటర్ గా పుడతాను : మంగళంపల్లి బాల మురళి కృష్ణ
TeluguStop.com
మన దేశంలో చాల ప్రొఫెషన్స్ ఉన్నాయ్.కొందరు ఆటలు ఆడితే మరికొందరు పాటలు పాడుతారు.
కొందరు చదువులు చదివి కొలువులు చేస్తుంటే మరి కొందరు వెట్టి చాకిరి చేసి బ్రతికేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇంత సోది ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు కదా.వస్తున్న అసలు విషయంలో కి వస్తున్న.
ఒక ఇంటర్వ్యూలో మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారు చెప్పిన మాటలు గుర్తచ్చి ఇలా మీ ముందు పెడుతున్న.
ఇప్పడు ఉన్న చాల మంది యువతకు మంగళం పల్లి బాల మురళి కృష్ణను పరిచయం చేయాల్సిందే.
ఎందుకంటే ఇప్పుడు రాక్, పాప్ వంటి వెస్ట్రన్ కల్చర్ ని బాగా ఎక్కించుకున్న వారికి ఒక సంగీత విద్వాంసుడి గురించి చెప్తే ఏం అర్ధం అవుతుంది చెప్పండి.
ఏది ఏమైనా అసలు విషయంలోకి వెళ్తే ఒక ఇంటర్వ్యూ లో బాలమురళి కృష్ణ గారు తనకు మరో జన్మ అంటూ ఉంటే ఇలా పాటలు, కచేరీలు గట్రా మానేసి ఏం చక్క క్రికెటర్ గా పుడతాను అని అన్నారు.
ఎందుకు అంటే మన భారత దేశం లో క్రికెట్ ఆడే వారికి చాల డబ్బు వస్తుంది.
క్రికెటర్స్ అంత కూడా బాగా డబ్బు సంపాదిస్తారు.ఆట తోనే కాకుండా ప్రకటనలతో కూడా కోట్లల్లో వారికి ఆదాయం ఉంటుంది.
ఇక అట తో పాటు ఒక మంచి ఉద్యోగం ఎలాగూ ఉంటుంది.ఏదైనా స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ పెట్టుకుంటాం అంటే బోలెడంత డబ్బు తో ఆటు స్థలం కూడా ప్రభుత్వమే ఇస్తుంది.
ఆట ఆడిన, మ్యాచ్ గెలిచినా, ఓడిపోయినా ఇచ్చిన డబ్బును మాత్రం వెనక్కి ఇవ్వాల్సిన పని లేదు.
"""/"/
ఇక ఎవరైనా క్రికెటర్ 10 వేల పరుగులు గనక కంప్లీట్ చేస్తే అబ్బో ఇక మీడియా, రాజకీయనాయకులు, సినిమా వారు తెగ పొగిడేస్తారు.
మరి బాల మురళి కృష్ణ గారి విషయానికి వస్తే తాను ప్రపంచ వ్యాప్తంగా 22 వేలకు పైగా కచేరీలు చేసారు.
ఎన్నో వేళా పాటలను ఆలపించారు.ఒక్క కచేరీకి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన తాను పాడిన అన్ని వేళా పాటలకు, కచేరీలు ఎన్ని కోట్ల డబ్బు వచ్చేది అంటూ అయన ప్రశ్నించారు.
కచేరి ఆర్గనైజ్ చేసే వారి దగ్గర డబ్బు లేక ఇవ్వడం లేదా అంటే ఆబ్బె అస్సలు కాదు.
కళను, కళా రంగాలను పొగుడుతారేమో కానీ డబ్బులు మాత్రం ఇవ్వరు అంటూ అయన చెప్పడం వారి శ్రమ దోపిడీని తెలియచేస్తుంది.
అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్.. ఇంకోసారి అలా అరవద్దంటూ?