బాలకృష్ణపై దాడి సరికాదు

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు ఆయన నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లారు.అయితే ఆయన్ను కొందరు వైకాపా నాయకులు అడ్డుకున్నారు.

వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుని రాయలసీమలో హైకోర్టు రాకుండా చేశారు అంటూ బాలకృష్ణను అడ్డుకున్నారు.

కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు.అయితే పోలీసులు మరియు బాలకృష్ణ వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది.

ఈ విషయమై తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించాడు.

బాలకృష్ణపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.ప్రాంతాల మద్య చిచ్చు పెట్టే విధంగా ఇలాంటి చర్యలు ఏమాత్రం సరికావు.

సీఎం జగన్‌ సూచన మేరకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అంటూ ఈ సందర్బంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి దాడుల వల్ల ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్..: సీఎం జగన్