బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్( Bajaj Chetak Electric Scooter ) భారత మార్కెట్ లోకి లాంచ్ అయింది.

2024లో చేతక్ అర్బేన్, ప్రీమియం అనే రెండు వేరియంట్ లతో ఉంటుంది.మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా వి1, ఓలా ఎస్1 లకు బజాజ్ చేతక్ గట్టి పోటీ ఇవ్వనుంది.

చేతక్ ప్రీమియం స్కూటర్ ఇండిగో మెటాలిక్ బ్రూ, బ్రూక్లిన్ బ్లాక్, హజెల్ నట్ కలర్లలో ఉంటుంది.

చేతక్ అర్బేన్ స్కూటర్ ఇండిగో మెటాలిక్ బ్రూ, కొర్సన్ గ్రే, బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్ కలర్లలో ఉంటుంది.

"""/" / బజాజ్ చేతక్ గంటకు 73 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది.

3.2 Kwh బ్యాటరీ సామర్థ్యంతో 127 కిలోమీటర్ల అధిక పరిధిని కలిగి ఉంటుంది.

చేతక్ ప్రీమియం అన్ బోర్డ్ 800w చార్జర్ తో వస్తుంది.అన్ని ఎలక్ట్రికల్ భాగాలతో ఐపీ67- రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది.

చేతక్ ప్రీమియం( Chetak Premium ) 5 అంగుళాల TFC డిస్ ప్లే తో ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్ ను కూడా పొందవచ్చు.టర్న్ బై టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ మేనేజ్మెంట్, హిల్ హోల్డ్ మోడ్, అదనపు టెక్ ప్యాక్ తో ఉంటుంది.

"""/" / ఇక మిగిలిన స్పెసిఫికేషన్ వివరాలను పరిశీలిస్తే.సీక్వెన్షియల్ రియల్ బ్లింకర్లు, సెల్ఫ్ క్యాన్సిలింగ్ బ్లింకర్లు, కుడి, ఎడమ కంట్రోల్ స్విచ్ లు, ఎలక్ట్రానిక్ హ్యాండిల్( Electronic Handle ), స్టీరింగ్ లాక్ లు, సీట్ స్విచ్ లు, హెల్మెట్ బాక్స్ ల్యాంప్ లాంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి.

బజాజ్ చేతక్ ధర విషయానికి వస్తే.చేతక్ అర్బేన్ న్యూఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.

115001 గా ఉంది.చేతక్ ప్రీమియం న్యూఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.

135463 గా ఉంది.

సోలో హీరోగా వరుసగా మూడు భారీ ఫ్లాపులు.. మట్కాతో వరుణ్ లక్ష్యాన్ని సాధిస్తారా?