బీఆర్ఎస్ పార్టీపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

కేసీఆర్ "బీఆర్ఎస్" పార్టీపై వైసీపీ యువనేత శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో చూడాలి అని చెప్పుకొచ్చారు.ఒకవేళ జగన్ తెలంగాణ రాజకీయాల ప్రవేశిస్తే మాత్రం అక్కడ ప్రకంపనాలు వస్తాయని తెలిపారు.

వైయస్ జగన్ అధికారంలో ఉన్న లేకపోయినా ఆయన అంటే స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయి.

ఆ దృష్టితోనే ప్రైవేటు సైన్యం ఉందని గతంలో చెప్పినట్లు వివరణ ఇచ్చారు.పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా జగన్ కి అభిమానులు ఉన్నారని తెలిపారు.

"బీఆర్ఎస్" పార్టీ ఇక్కడకొచ్చి ఏదో చేసేస్తుంది అని తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు.వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో చూడాలి.

జగన్ సార్ తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశిస్తే మాత్రం అక్కడి ప్రభుత్వాలే.తలకిందులు అవుతాయని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక ఇదే సమయంలో శ్రీకాకుళంలో జనసేన సభలో వైసీపీ పై సెటైర్లు వేసిన హైపర్ ఆది పై కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మండిపడ్డారు.

హైపర్ ఆదికి ఏపీలో 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా అని ప్రశ్నించారు. """/"/ పవన్ కళ్యాణ్ నాయకత్వ లోపం ఉన్న నేత.

తమిళ డబ్బింగ్ "రంగం" సినిమాలో విలన్ లాంటోడు అని వ్యాఖ్యానించారు.ఆ సినిమాలో విలన్ ప్రజల ముందు ఉద్యమం పోరాటం అంటాడు.

అంతర్గతంగా ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకుంటాడు.పవన్ కళ్యాణ్ కూడా అంతే.

పొద్దున్నే లెగిస్తే ఉద్యమం ధైర్యం అని పెద్ద పెద్ద డైలాగులు వేసి చివరాఖరికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాడు.

ప్రజలను మోసం చేసిన పెద్ద అవినీతిపరుడు చంద్రబాబే.అటువంటి వ్యక్తికి పవన్ మద్దతు తెలిపాల్సిన అవసరం ఏముంది అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రశ్నించారు.

అరె బుడ్డోడా.. అల్లు అర్జున్ ని మించి పోయావుగా.. వైరల్ వీడియో