టిడిపి కి సవాల్ విసిరిన బైరెడ్డి సిద్దార్ధరెడ్డి
TeluguStop.com
మళ్ళీ అధికారం లో రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని,వస్తే మీరు రాజకీయలనుంచి తప్పుకుంటారా అని ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నాయకులకు సవాల్ నంద్యాల జిల్లా నందికొట్కూరు లో రాష్ట్ర యువ విభాగం అధ్యక్షుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వాసవీ మాత దర్శనం కోసం వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు టీడీపీ నాయకులను ఉద్దేశించి చేశారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలో రాకపోతే తాను రాజకీయాలనుండి శాశ్వతంగా తప్పుకుంటానని, టీడీపీ పార్టీ అధికారంలో రాకపోతే ఆ పార్టీ నాయకులు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు.
మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పై ప్రజల విశ్వాసం తగ్గిందని, అసంతృప్తి ఉందని ప్రచారం చేస్తున్నవారు తన సవాల్ ను స్వీకరించాలన్నారు.
ఓటర్లు తమ అభిప్రాయాలను రోజు వెల్లడించరని ఎన్నికల్లో తెలియచేస్తారన్నారు.ప్రజల కు మంచి చేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు.
జరగబోయే ఎన్నికలు నీతికి అవినీతికి జరిగే ఎన్నికలన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కి గట్టి బుద్ధి చెబుతారన్నారు.
ఇకనైనా టీడీపీ నాయకులు డబ్బా మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవుపలికారు.