ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్..!!
TeluguStop.com
ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి( CM Arvind Kejriwal ) గురువారం బెయిల్ లభించింది.
లక్ష రూపాయలు పూచికత్తుతో ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
దీంతో సీఎం కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.
లిక్కర్ స్కామ్ కేసులో ఆయన లంచం తీసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేజ్రీవాల్ పై చార్జిషీట్ దాఖలు చేయటం తెలిసిందే.
"""/" /
ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయి దాదాపు మూడు నెలలు కావస్తోంది.
ఈ క్రమంలో అనేక మార్లు బెయిల్ ( Bail ) కోసం న్యాయస్థానంలో పోరాడగా మధ్యలో తాత్కాలిక బెయిల్ రావడం జరిగింది.
ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసే ప్రాంతాలలో కేజ్రీవాల్ తనదైన శైలిలో ప్రచారం చేయటం జరిగింది.
ఆ తర్వాత బెయిల్ గడువు ముగియడంతో.సరెండర్ అయ్యారు.
కాగా మళ్లీ బెయిల్ కోసం న్యాయస్థానంలో పోరాడగా.ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కేజ్రీవాల్ కి బెయిల్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రేపు తీహార్ జైలు నుండి విడుదల కాబోతున్నారు.
విరూపాక్ష డైరెక్టర్ తో నాగచైతన్య కొత్త సినిమా.. వైరల్ అవుతున్న పోస్టర్!