కంటి పరీక్షల కోసమే చంద్రబాబుకు బెయిల్..: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు.

కంటి పరీక్షల కోసమే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని తెలిపారు.పరీక్షలు పూర్తయిన తరువాత మళ్లీ చంద్రబాబు జైలుకే వెళ్తారని నారాయణ స్వామి అన్నారు.

అనారోగ్య సమస్యల పేరుతో బెయిల్ కోసం డ్రామాలు ఆడారని ఆరోపించారు.టీడీపీ నేతలు హమాస్ ఉగ్రవాదుల్లా ఆలోచిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కేసు మెరిట్స్ మీద రాలేదన్న ఆయన కేవలం అనారోగ్య కారణాల వలన వచ్చిందని చెప్పారు.

ఈ క్రమంలో నాలుగు వారాల అనంతరం తిరిగి జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు.

ప్రణయగోదారి సినిమా రివ్యూ!