మంగోలియా బాషలో బాహుబలి…ప్రపంచ వ్యాప్త గుర్తింపు

తెలుగు సినిమా సత్తా జాతీయ స్థాయిలో వినిపించేలా చేసిన, భారతీయ సినిమా స్టామినాని అంతర్జాతీయ స్థాయిలో వినిపించేలా చేసిన సినిమా బాహుబలి.

జక్కన్న అద్భుత సృష్టి అయిన ఈ సినిమా రెండు భాగాలుగా ఏకంగా ఐదేళ్ళ పాటు తెరకెక్కింది.

ఇక ఈ సినిమా రెండు భాగాలు కలిపి రెండు వేల కోట్లకి పైగా ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది.

భారతీయ సినీ చరిత్రలో ఈంత ఎక్కువగా కలెక్ట్ చేసిన సినిమాల జాబితాలో బాహుబలి మొదటి స్థానంలో నిలిచింది.

ఇక భవిష్యత్తులో వేరే సినిమాలు బాహుబలి రికార్డ్ ని ఎంత వ్వరకు అధికమిస్తాయి అనేది చెప్పలేని పరిస్థితి.

ఈ రికార్డుని బ్రేక్ చేయడం మళ్ళీ రాజమౌళికి అయిన సాధ్యం అవుతుందా అంటే అది సందేహమనే చెప్పాలి.

ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి తన ప్రభావం చూపిస్తుంది.చైనా, పాకిస్తాన్, జపాన్, రష్యా భాషల్లో అనువదింపబడి అక్కడి వారిని ఆకర్షించిన బాహుబలి తాజాగా మరో దేశ ప్రజల ముందుకు వెళ్తుంది.

తూర్పు ఆసియా దేశమైన మంగోలియాలో బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని మంగోలియన్ భాషలోకి అనువదించి టెలిక్యాస్ట్ చేయనున్నారు.

అక్కడి ఛానెల్ అయిన టీవీ 5 లో ఆగస్టు 16వ తేదీన బాహుబలి ప్రదర్శితం అవుతుంది.

మంగోలియా బాషలో డబ్బింగ్ అయ్యి ప్రదర్శితమవుతున్న మొదటి ఇండియన్ సినిమాగా బాహుబలి నిలిచిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల ప్రజలని ఈ జానపద చిత్రం అలరించిందని చెప్పాలి.

ఫాంటసీ కథ అయిన భారతీయ రాజుల వీరత్వాన్ని బాహుబలి సినిమా తెరపై జక్కన్న ఆవిష్కరించారు.

అందుకే ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

ఖాళీ పొట్ట‌తో ఫ్రూట్ జ్యూసులు తాగుతున్నారా.. అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్లే!