పీవీ కి భారత రత్న డిమాండ్… ఒక్కటైన భారత ఎన్నారై సంఘాలు..!!

తెలుగు జాతి ఎంతో గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, అపర చాణిక్యుడిగా పేరొందిన రాజకీయ నేత తెలుగు జాతి ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

అయితే తాజాగా ఈ డిమాండ్ ను అమెరికాలోని తెలుగు సంఘాలు అన్నీ ఏకమయ్యి ముక్త ఖంటంతో వినిపిస్తున్నాయి.

ది రిమంబరింగ్ పీవీ సీరీస్ లా ప్రజలలోకి తీసుకువెళ్తున్నారు.పీవీ 100 వ పుట్టినరోజు సందర్భంగా పీవీ కి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ను ముందుకు తీసుకువెళ్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ సంఘాలు పీవీ కి డిమాండ్ ఇచ్చే విషయంపై ఒకే తాటిపై ఉంటామని తెలిపాయి.

భారత ప్రభుత్వం తమ డిమాండ్ ను పరిశీలించాలని కోరుతున్నాయి.రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ భారత ప్రభుత్వం భారత రత్న ఫర్ పీవీ అనే డిమాండ్ తో అన్ని సంఘాలు ఒక్కటయ్యి గొంతెత్తాయి.

ఆన్లైన్ లో తమ డిమాండ్ కు మద్దతు తెలుపాలని భారతీయులను కోరుతున్నాయి.పీవీ శతజయంతి సందర్భంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఈ కార్యక్రమాలను ప్రముఖ రాజకీయ వేత్తలు, మేధావులు కూడా పాల్గొంటున్నారు.ఇదిలాఉంటే ఉత్తర అమెరికా తెలుగు సంఘం, అమెరికా తెలుగు సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సమితి, సిలికాన్ ఆంధ్రా డెవలప్మెంట్ ఫోరమ్ , సెయింట్ లూయిస్ గుజరాత్ సమాజ్, మొదలగు అన్ని సంఘాలు ఈ డిమాండ్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి.

అమెరికా వ్యాప్తంగా దాదాపు 81 సంఘాలు పీవీ కి భారత రత్న డిమాండ్ కు మద్దతు ఇస్తున్నాయి.

పీవీ ప్రాముఖ్యత, వివరిస్తూ పీవీ కి భారతరత్న వినతిపత్రం పై సంతకాలు చేస్తున్నాయి.

ఈ కార్యక్రమాలు పలు సంఘాల సభ్యులు , నేతలు పాల్గొంటున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్టు లుగా మారనున్న సీనియర్ నటీనటులు వీళ్లే.?