Mega Heroes : మెగా హీరోలకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా ? అందుకే ఇంకా ఒక ఏడాది ఎవరికి కనిపించరా ?

మెగా హీరోలకి( Mega Heroes ) నిజంగానే బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుగా ఉంది.

ఈ ఏడాది మొదటి ఆరు నెలలు ఒకరి తర్వాత ఒకరు గుడ్ న్యూస్ చెబుతూనే వచ్చారు.

వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి విజయాన్ని అందుకుంటే రామ్ చరణ్ తన కూతురు పుట్టుకతో ఒక గుడ్ న్యూస్ చెప్పారు అలాగే ఆస్కార్ మరొక న్యూస్.

ఇక అలాగే అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దక్కించుకోవడంతో మంచి న్యూస్ చెప్పగా సాయి ధరంతేజ్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో గట్టి కం బ్యాక్ ఇచ్చాడు.

ఇలా వరుస పెట్టి సినిమాలో లేదా ఏదో ఒక గుడ్ న్యూస్ తో మెగా ఫాన్స్ ని సందడి చేసిన మెగా హీరోలకి దిష్టి తగిలిందా ఏంటి అనే విధంగా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది.

అందుకే 2024 లో చిరు నుంచి రామ్ చరణ్ వరకు ఎవరు కనిపించరు అనే వార్త వైరల్ అవుతుంది.

"""/" / సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) బ్రో చిత్రం తర్వాత ఈ బ్యాడ్ న్యూస్ లు ఒకటి తర్వాత ఒకటి బయటకు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి భోళాశంకర్ ఓవైపు ఇప్పటికే చిరంజీవికి వెన్నులో వరకు పుట్టిస్తుంది.

ఇక వరుణ్ తేజ్( Varun Tej ) ఘండీవ దారి సంగతి ఎంత చెప్పినా తక్కువే అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో ఎవరికి తెలియదు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా 2023వ సంవత్సరంలోనే విడుదలవలసి ఉండగా అది ఆలస్యం అవుతూ వచ్చే ఏడాదికి అయిన వస్తుందని అభిమానులు ఆశపడ్డారు కానీ ఇప్పుడు 2025 సంక్రాంతి వరకు ఈ చిత్రం రావట్లేదు అని తెలిసి ఉసురు మంటున్నారు.

"""/" / చిరంజీవి( Chiranjeevi ) పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది ఆయన తీయబోయే సినిమా 2025 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథలో మార్పులు ఏర్పడడంతో అది షూటింగ్ కూడా మరొక ఏడాది పాటు ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు.

ఇక వశిష్ట సినిమా సోషియో ఫాటసి కారణంగా ఇంకా కొంతకాలం షూటింగ్ చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది దాంతో మరో ఏడాది కి పైగా ఆయన సినిమాలు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ఇండియన్ పాలిటిక్స్ లో బాబాయ్ రియల్ గేమ్ ఛేంజర్…చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!