Nithya Menon: నిత్యమీనన్ లుక్స్ పై బ్యాడ్ కామెంట్స్.. మరీ అంత టార్గెట్ చేశారేంట్రా బాబు?
TeluguStop.com
కొందరు జనాలు కొంతమంది సెలబ్రెటీలను బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.ఎంతలా అంటే వారు ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు వాటిపై ఖచ్చితంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
అయితే ఇటువంటిది నిత్యమీనన్( Nithya Menon ) కి బాగా ఎదురవుతూ ఉంటుంది.
తను ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు వెంటనే ఏదో రకంగా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు కొందరు.
అయితే తాజాగా తను ఒక పోస్ట్ షేర్ చేయటంతో ఆ పోస్టుకి బ్యాడ్ గా కామెంట్ పెట్టారు.
ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఒకప్పుడు టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో సందడి చేసింది నిత్యామీనన్.
మలయాళీ భాషకు చెందిన ఈమె తెలుగు, మలయాళం తోపాటు ఇంగ్లీష్, కన్నడ భాషల్లో కూడా నటించింది.
తొలిసారిగా 1998లో బాలనటిగా అడుగు పెట్టింది నిత్య.ఆ తర్వాత 2010లో అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.
ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. """/" /
అలా వరుసగా ఎన్నో అవకాశాలు అందుకోగా తనకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఇష్క్, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు మంచి సక్సెస్ ను ఇచ్చాయి.
కొన్ని సినిమాలలో అతిధి పాత్రలలో కూడా నటించింది.మధ్యలో కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ రిఎంట్రీ ఇచ్చింది.
కానీ అప్పటిలా వరుస సినిమాలు కాకుండా గ్యాప్ లో మాత్రమే అవకాశాలు అందుకుంటుంది.
ఇక బుల్లితెరపై కూడా కొన్ని షోలలో జడ్జిగా చేసింది.నిత్యమీనన్ సింగర్ కూడా.
తన పాటలతో అందర్నీ బాగా ఫిదా చేస్తూ ఉంటుంది.నిత్యమీనన్ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ తన సినిమాకి సంబంధించిన వీడియోలను, తన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.
కానీ ఎప్పుడూ కూడా అందాలు ఆరబోసినట్లు కనిపించదు. """/" /
అయినా కూడా కొందరు ట్రోలర్స్ ఆమెను బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు.
అయితే తాజాగా తను తన ఇన్ స్టా వేదికగా( Instagram ) కొన్ని ఫొటోస్ పంచుకుంది.
అందులో తను చీర కట్టుకొని కాస్త ఓల్డ్ లుక్ లో డిఫరెంట్ చూపులతో కనిపించింది.
అయితే అదంతా తన సినిమా క్యారెక్టర్ లోనిదని అర్థమవుతుంది.అయితే ఆ ఫోటోలు చూసిన తన అభిమానులు లైక్స్, కామెంట్స్ పెట్టగా మరి కొంతమంది బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
పక్క రెడ్ లైట్ మెటీరియల్ అంటూ దారుణంగా బ్యాడ్ కామెంట్ చేశారు.ఇక మరికొంతమంది తను ముసలిది అయింది అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఆ కామెంట్స్ చూసి తన ఫాన్స్ వారిపై తిరిగి కౌంటర్లు వేస్తున్నారు.
నోరు అదుపులో ఉంచుకుంటే మంచిది అంటూ వారికి తిరిగి సమాధానాలు ఇస్తున్నారు.ఇక మరి కొంతమంది.
పాపం తనను ఎందుకంత టార్గెట్ చేశారేంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్31, గురువారం 2024