మళ్లీ అధికారంలోకి.. సజ్జల కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.
కౌంటింగ్ చీఫ్ ఏజెంట్లతో సమావేశం కాగా.ఈ భేటీకి 175 నియోజకవర్గాలకు చెందిన చీఫ్ పోలింగ్ ఏజెంట్లు హాజరయ్యారు.
ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తున్నామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.కౌంటింగ్ జరిగే సమయంలో జాగ్రత్తగా వ్యవహారించాలని ఆయన సూచించారు.