కృష్ణ వ్రింద విహారి సినిమాలో హీరోయిన్ 'షెర్లీ సెటియా' ఎవరో తెలుసా ? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.అయితే తెలుగు సినిమా పరిశ్రమలోకి మాత్రం ఎక్కువగా తమిళ సినిమా హీరోయిన్ల హావానే కనిపిస్తుంది.
మహా అయితే కన్నడ కస్తూరి లు లేదా బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ ని ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు మన మూవీ మేకర్స్.
అయితే తెలుగులోకి వచ్చే హీరోయిన్లలో మాత్రం ఎక్కువగా కోలీవుడ్ హీరోయిన్స్ దే హవా ఉందని చెప్పక తప్పదు.
అయితే ఎవరు ఊహించని విధంగా తన సినిమాలో ఒక విదేశీ హీరోయిన్ ని పెట్టుకున్నాడు నాగ శౌర్య.
నాగ శౌర్య హీరోగా నటించిన సినిమా కృష్ణ వ్రింద విహారి.ఈ సినిమా కోసం ఏకంగా విదేశాల నుంచే ఒక హీరోయిన్ ఇంపోర్ట్ చేశాడు నాగశౌర్య.
ఆమె మరెవరో కాదు న్యూజిలాండ్ లో ఎంతో ఫేమస్ సింగర్ అయినటువంటి షెర్లీ సెటియా.
ఈమె ప్రస్తుతం నాగశౌర్య సినిమా కృష్ణ వ్రింద విహారి చిత్రంతో తెలుగులోకి తొలిసారి పరిచయం కాబోతోంది.
ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టైలర్స్ లో హీరోయిన్ ని చూసిన వారందరూ కూడా చాలా బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఎంతో మంది తెలుగు హీరోయిన్లు సైతం తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్న ఇలాంటి ఒక సమయంలో వచ్చిన షెర్లీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
"""/" /
అంతే కాదు నాగ శౌర్య సినిమా కోసం తెలుగు బాగా నేర్చుకుందట షెర్లీ సెటియా.
ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో సైతం తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇప్పటికే సింగర్ గా పాపులర్ అయిన షెర్లీ ఫోబ్స్ మ్యాగజిన్ ముఖ పుస్తకంపై కూడా రావడం విశేషం.
ఇక టాలీవుడ్ లోకి ఎంటర్ ఇవ్వకముందే బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించింది షెర్లీ.
అంతేకాదు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించి తన ఏంటో ప్రూవ్ చేసుకుంది.
ఇక తన యూట్యూబ్ ఛానల్ లో ఇప్పటికే దాదాపుగా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
వెట్రిమారన్ డైరెక్షన్ లో అవసరమా తారక్.. ఈ సినిమా రిజల్ట్ చూసైనా మారతావా?