Baby Teaser Review: ఆనంద్ దేవరకొండ వైష్ణవి బేబీ టీజర్ రివ్యూ.. మనస్సులకు హత్తుకునే ప్రేమకథలా?

సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి,( Vaishnavi ) ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) జంటగా నటించిన తాజా చిత్రం బేబీ.

( Baby Movie ) ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లో విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు మూవీ మేకర్స్.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా అమీర్ పేట్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో వంశీ పైడిపల్లి, మారుతీ ముఖ్య అతిథులుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు.

"""/" / యూత్ లో దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా కథ ఏంటి ఎలా ఉండబోతోంది అన్న విషయానికి వస్తే.

స్కూల్ వయసులోనే ప్రేమించుకుంటుంది ఒక జంట.అమ్మాయి (వైష్ణవి)కి రంగు తక్కువ.

అయినా నిండైన కళ.అబ్బాయి(ఆనంద్ దేవరకొండ)కి చదువు రాక పదో తరగతి తప్పి ఆటో డ్రైవర్ గా మారతాడు.

అయినప్పటికీ వారిమధ్య స్నేహం కొనసాగుతుంది.ఈలోగా ధనికుడైన మరో కుర్రాడు(విరాజ్ అశ్విన్)వీళ్ళ జీవితాల్లోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.

"""/" / ఆ బేబీ కలర్ మారిపోయి గొప్ప అందగత్తెగా నిలుస్తుంది.అప్పుడు మొదలవుతుంది అసలైన కన్ఫ్యూజన్.

ఇంతకీ ఈ రెండు కథలు సమాంతరంగా జరిగేవా లేక ట్విస్టు ఏదైనా పెట్టారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

ఆ సస్పెన్షన్ ఏంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.కేవలం యూత్ ని( Youth ) లక్ష్యంగా పెట్టుకున్న ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ప్రేమ కథలు విజువల్స్ యువతని ఆకట్టుకోనున్నాయి.

అయితే ముందు నుంచి బేబీ హైప్ లో ప్రధాన పిల్లర్ గా నిలుస్తున్న విజయ్ బుల్గనిన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా మారబోతున్నాయి.

ఆలస్యమైనా మంచి టైమింగ్ చూసుకుని వస్తున్న బేబీలో క్లిక్ అయ్యే కంటెంట్ కనిపిస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలిమట్టికి ఉన్న విలువ ఇదే.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?