Baby Review : బేబీ రివ్యూ: సినిమా హిట్.. కానీ అదొక్కటే మైనస్?

baby review : బేబీ రివ్యూ: సినిమా హిట్ కానీ అదొక్కటే మైనస్?

డైరెక్టర్ సాయి రాజేష్ నీలం దర్శకత్వంలో రూపొందిన సినిమా బేబీ.( Baby ) ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, బబ్లూ, లిరిషా, కుసుమ తదితరులు నటించారు.

baby review : బేబీ రివ్యూ: సినిమా హిట్ కానీ అదొక్కటే మైనస్?

ఈ సినిమాకు విజయ్ బుల్గాలిన్ సంగీతం అందించారు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

baby review : బేబీ రివ్యూ: సినిమా హిట్ కానీ అదొక్కటే మైనస్?

ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

H3 Class=subheader-styleకథ:/h3p కథ విషయానికి వస్తే.వైష్ణవి( Vaishnavi ) ఒక బస్తీ అమ్మాయిగా కనిపిస్తుంది.

ఇక ఈమె తన ఎదురింట్లో ఉండే ఆనంద్ ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంది.

కానీ వీరి ప్రేమ కేవలం స్కూల్ డేస్ వరకు మాత్రమే ఉంటుంది.ఇక ఆనంద్ టెన్త్ ఫెయిల్ అవ్వడంతో ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు.

ఇక వైష్ణవి మాత్రం ఇంజనీరింగ్ చేస్తుంది.ఇక ఆ కాలేజ్ లో ఏర్పడిన పరిశాల వల్ల వైష్ణవి లో బాగా మార్పులు వస్తాయి.

అంతేకాకుండా తన క్లాస్మేట్ విరాజ్ కు దగ్గర అవుతుంది.వీరిద్దరూ స్నేహం పేరుతో శారీరకంగా దగ్గరవుతారు.

ఇక చివరికి ఏం జరుగుతుంది.వీరి మధ్య ఉన్న వ్యవహారం ఆనంద్ కు తెలుస్తుందా లేదా.

చివరికి తను ఎవరిని ఇష్టపడుతుంది అనేది మిగిలిన కథలోనిది. """/" / H3 Class=subheader-styleనటినటుల నటన: /h3pనటీనటుల నటన విషయానికి వస్తే.

ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశాడు.ఈ సినిమాలో ఇదివరకు కనిపించని విధంగా కొత్తగా కనిపించాడు.

స్కూల్ డేస్ పాత్రలో అంతగా మెప్పించ లేకపోయినా ఆటో డ్రైవర్ పాత్రలో మాత్రం బాగా పర్ఫామెన్స్ చేశాడు.

కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా కనెక్ట్ చేశాడు.హీరోయిన్ వైష్ణవి కూడా బాగా మెప్పించింది.

రెండు రకాల పాత్రలలో అదరగొట్టింది.ఇక విరాజ్ నెగిటివ్ పాత్రలో బాగా పర్ఫామెన్స్ చేశాడు.

మిగిలిన నటీనటులంత సినిమాకు తగ్గట్టు పనిచేశారు. """/" / H3 Class=subheader-styleటెక్నికల్:/h3p టెక్నికల్ విషయానికి వస్తే.

డైరెక్టర్ సాయిరాజ్ ( Director Sairaj )యువతని దృష్టిలో పెట్టుకొని మంచి కథను ఎంచుకున్నాడు.

అంతేకాకుండా మంచి సంభాషణలను, కథను తెరపై చూపించే విధానం బాగుంది.కానీ చివరికి మంచి ముగింపు ఇవ్వలేకపోయాడు.

విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు బాగా ఆకట్టుకున్నాయి.సినిమాటోగ్రఫీ బాగుంది.

మిగిలిన నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు పని చేశాయి. """/" / H3 Class=subheader-styleవిశ్లేషణ:/h3p చదువుకునే వయసులోనే ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య పుట్టిన ప్రేమను బాగా చూపించారు.

ముఖ్యంగా ఈ సినిమా ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి.

నిజానికి డైరెక్టర్ ఈ తరం యువత ప్రేమ విషయంలో ఎదుర్కొనే పాయింట్ లను చూపించాడు.

ముఖంగా హీరో టెన్త్ ఫెయిల్ అయ్యే ఆటో నడపడం, హీరోయిన్ పై చదువులు చదవడం బాగా ఆకట్టుకుంటుంది.

పైగా హీరోయిన్ లో మార్పులు రావటం.దాంతో హీరో హీరోయిన్ మధ్య బేధాభిప్రాయాలు రావటం అనేది బాగా చూపించారు.

ఇక సినిమా మొత్తం బాగా చూపించినప్పటికీ కూడా క్లైమాక్స్ మాత్రం అసంతృప్తిగా ఉందని చెప్పాలి.

"""/" / H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p సినిమా కథ, ఆకట్టుకునే అంశాలు, నేపథ్య సంగీతం, పాటలు, నటీనటుల పర్ఫామెన్స్, సినిమాటోగ్రఫీ.

H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p కొన్ని సన్నివేశాలు బాగా సాగినట్లు అనిపించాయి.చివర్లో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.

H3 Class=subheader-styleబాటమ్ లైన్:/h3p చివరగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా టీనేజ్ కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి.

కానీ క్లైమాక్స్ ఒకటే నిరాశపరిచినట్లు అనిపించిన కూడా ఈ సినిమా చూడవచ్చు అని చెప్పాలి.

H3 Class=subheader-styleరేటింగ్:/h3p 3/5.

గోపీచంద్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన బాలకృష్ణ.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

గోపీచంద్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన బాలకృష్ణ.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!