బేబీ సినిమా ప్రొడ్యూసర్ SKN కన్నీటి కష్టాలు..చివరికి ఇల్లు కూడా అమ్మి..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అంత ఒక్క సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.అదే బేబీ( Baby ).

చిన్న సినిమాగా, అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది.

సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా భారీ లాభాలని తెచ్చి పెడుతుంది.

జులై 14 న విడుదలైన ఈ సినిమా ఇప్పటికి చాలా ప్రాంతాల్లో అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది.

ఈ సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) ఈ ఒక్క సినిమాతోనే తనేంటో ప్రూవ్ చేసుకుంది.

ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) హీరోగా నటించగా మరో ముఖ్యమైన పాత్రలో విరాజ్ నటించాడు.

ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించగా SKN నిర్మించారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పటికే సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.

అయితే ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ తో పాటు మరొకరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

ఆయనే నిర్మాత SKN.గతంలో SKN స్పీచెస్ వైరల్ అయ్యేవి.

అయితే ఇప్పుడు అన్ని మీమ్స్ లో ఆయనే కనిపిస్తున్నారు.అయితే SKN మాత్రం ఆ మీమ్స్ ని ఎంజాయ్ చేసారు.

బేబీ సినిమా స్క్రీనింగ్ అయిపోయాక బయటికి వచ్చి తొడకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అంతేకాదు SKN స్పీచ్ అయిపోయాక మైక్ విసిరేయడం మరో హై లైట్.ఈ వీడియో పై ఎన్నో మీమ్స్ వస్తున్నాయి.

అయితే వైరల్ అవుతున్న SKN గురించే అందరికి తెలుసు.కానీ SKN పడిన కష్టాలు మాత్రం ఎవ్వరికి తెలీదు.

"""/" / తాజాగా బేబీ సినిమా చూసిన అల్లుఅర్జున్ అభినందన సభ ఏర్పాటు చేసారు.

ఈ సభలో అల్లుఅర్జున్ కొన్ని విషయాలని బయటపెట్టాడు.ఇప్పుడు ఈ స్పీచ్ వైరల్ అవుతుంది.

అల్లుఅర్జున్ SKN గురించి మాట్లాడుతూ ఆయన పడిన కష్టాలు చెప్పాడు.SKN చిరంజీవి వీరాభిమాని.

ఇలా బన్నీవాసుకి పరిచయమయ్యాడు.బన్నీవాసు SKN ని హైదరాబాద్ కి వచేయమన్నాడు.

అప్పటికే అల్లుఅర్జున్ ఇంకా ఎవ్వరికి తెలీదు.SKN ని అప్పుడు చిరంజీవి డ్యాన్స్ షెడ్ పక్కన ఒక రూమ్ లో ఉండమని చెప్పాడు.

అలా SKN జర్నీ జర్నలిస్ట్ గా పరిచయమయ్యారు.ఆ తర్వాత సినిమా PR అయి, ఆ తర్వాత బన్నీ వాసు, మారుతి పరిచయాలతో మేనేజర్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ గా మారి అనంతరం ప్రొడ్యూసర్ గా మారారు.

"""/" / హైదరాబాద్ కి చాలా ఏళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నా, చాలా సినిమాలకు పనిచేసినా సొంత ఇల్లు కూడా కొనుక్కోలేకపోయారు.

బేబీ సినిమా కథ విన్న తరువాత ఎలాగైనా ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకున్నారు.దీంతో SKN గృహప్రవేశం చేయాలనుకున్న ఫ్లాట్ ని కూడా అమ్మేసి బేబీ సినిమా తీసాడు.

అయితే 50 రోజుల్లో తీయాల్సిన ఈ సినిమా మూడేళ్లు పట్టింది.డబ్బు సరిపోక అల్లు అరవింద్ ( Allu Arvind )దగ్గర కూడా అప్పు చేసారు.

ఇలా SKN ఎన్నో కష్టాలు పడి బేబీ సినిమాను నిర్మించాడు.ఇప్పుడు బేబీ ఘన విజయం సాధించడంతో ఫుల్ ఖుషిలో ఉన్నాడు.

అందుకే అల్లుఅర్జున్ మాట్లాడుతూ SKN ఎంత ఓవర్ చేసినా చాలా తక్కువే అనిపిస్తుంది.

ఎందుకంటే ఆ సక్సెస్ అతని కష్టం అని చెప్పాడు.ఈ సినిమాతో ఇప్పుడు SKN మరోస్థాయికి వెళ్ళాడు.

పాత్ర ఏదైనా ఆ పని అస్సలు చేయను.. జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్!