Prabhavati : బేబీ మూవీ నటి ప్రభావతి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి ప్రభావతి( Senior Actress Prabhavati ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది ప్రభావతి.

అటు సీరియల్స్ లో ఇటు సినిమాలలో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

సినిమా ఇండస్ట్రీలో దాదాపు 22 ఏళ్లుగా నటిగా కొనసాగుతూ ఎన్నో పాత్రలలో నటించింది.

ఇటీవలే విడుదల అయినా బేబీ సినిమా( Baby Movie )లో హీరోకి తల్లి క్యారెక్టర్ లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

ఇందులో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. """/" / ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.

మూగ చెవిటి తల్లి( Deaf And Dumb Mother Role )గా నటించి ఎమోషనల్ సన్నివేశాలలో కన్నీరు తెప్పించింది ప్రభావతి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరియర్ లో జరిగిన విషయాలను బేబీ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ.బేబీ సినిమాలో ఇంకా చాలా హర్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయి.

కానీ నిడివి ఎక్కువగా ఉండటం వల్ల చాలా సీన్ లను కట్ చేశారు.

ఆనంద్ కాంబినేషన్‌లో, నాగబాబుగారి( Nagababu ) కాంబినేషన్‌లో, చాలా సీన్లు కట్ అయ్యాయి.

మా డైరెక్టర్ గారు చెప్పారు కదా, తప్పని సరి పరిస్థితుల్లో అలా కట్ అయిపోతుంటాయి.

ఈ సినిమా అనే కాదు చాలా సినిమాల్లో ఇది నార్మల్‌గా జరుగుతూ ఉంటుంది.

"""/" / కొన్ని సినిమాల్లో అయితే సీన్లు లేకపోవడం కాదు.టోటల్‌గా మనమే ఉండం.

ట్రాక్ మొత్తం తీసేస్తారు.ఔట్ పుట్ వచ్చేదాన్ని బట్టి ఎడిటింగ్‌లో కొన్ని సీన్లు తీసేస్తుంటారు.

ఈ సీన్లు తీసేసినా పర్లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తుంటారు.మెయిన్ ట్రాక్‌లను ఎలాగూ తీయలేరు.

అలాంటప్పుడు సైడ్ ట్రాక్‌లను తీసేస్తుంటారు.కొన్ని సందర్భాల్లో తప్పదు అని ప్రభావతి చెప్పుకొచ్చింది.

ఈ సినిమా ద్వారా తనకు మంచి గుర్తింపు దక్కిందని తెలిపింది ప్రభావతి.ఈరోజుల్లో ఎవరిది తప్పు అని చెప్పలేం కానీ.

బిజీ లైఫ్‌లో ఎవరి జీవితం వాళ్లది అన్నట్టుగా ఉంటున్నారు.అమ్మ, నాన్న రిలేషన్ కంటే లవర్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

కాబట్టి అమ్మకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దానిపై యూత్‌ని ఆలోచింపజేస్తుంది తెలిపారు.

నా ఫస్ట్ రెమ్యూనరేషన్ 116. """/" / నేను నటించడానికి తీసుకున్న ఫస్ట్ అడ్వాన్స్( Prabhavati First Remuneration ) అదే.

నేను కమర్షియల్ కాదు, కంఫర్ట్.నేను ఏ పాత్ర చేసినా నా కంఫర్ట్ చూసుకుంటాను.

నేను ఫొటోలు పట్టుకుని తిరగడం, ఆడిషన్స్‌కి వెళ్లడం అని ఏమీ లేదు.నా గురించి తెలిసి, నాకు ఆ పాత్ర సూట్ అవుతుందంటే పిలిచి పాత్ర ఇస్తారు.

లేదంటే లేదు.సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తున్నాను.

సీరియల్స్ చేయాలనేది మా అమ్మ కోరిక.అందుకే అప్పుడప్పుడూ చేస్తుంటాను.

సినిమాలు చేసి సీరియల్స్‌ చేస్తుంటాను కాబట్టి సీరియల్ నటిననే మార్క్ పడలేదు.సీరియల్ ఆర్టిస్ట్ ప్రభావతి అని అనరు.

సినిమాలు చేస్తూనే సీరియల్స్ చేస్తుంటాను అని చెప్పుకొచ్చారు ప్రభావతి.

చెన్నైలో క తెలుగు వెర్షన్ రిలీజ్.. ఈ విషయంలో కిరణ్ ను మెచ్చుకోవల్సిందే!