బేబీ కథ చెప్పడానికి వెళ్తే డైరెక్టర్ సాయి రాజేష్ ను ఆ హీరో అంతగా అవమానించారా?

దర్శకుడు సాయి రాజేష్ ( Sai Rajesh ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం బేబీ( Baby ).

ఈ సినిమా జూలై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా ఎంతో సక్సెస్ సాధించినటువంటి ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం చూసి అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఇలా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం సిని సెలెబ్రెటీలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇలా ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో సోమవారం హైదరాబాదులో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

"""/" / ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్( Allu Aravind ) , నాగబాబు( Nagababu ) విజయ్ దేవరకొండ ( Vijay Devarakond ) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను ఈ సినిమా కథను ఒక హీరోకి చెప్పడానికి వెళ్ళాను అయితే ఆయన కనీసం కథ కూడా వినకుండా తనని వెనక్కి పంపించారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆ హీరో అలా చేయడంతో చేసేదేమీ లేక తాను వెనుతిరిగానని అయితే విజయ్ దేవరకొండకు ఈ సినిమా చెప్పగానే ఆయన ఆనంద్ పేరు సజెస్ట్ చేశారని తెలిపారు.

"""/" / ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ 100% నాకు ఏమి కావాలో అది ఇచ్చారని తెలియజేశారు.

అలాగే నిర్మాత ఎస్ కే ఎన్ నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను నమ్మి ఇన్ని కోట్లు ఖర్చు చేశారు.

ఇక వైష్ణవి సైతం తాను చేస్తున్నటువంటి జాబ్ వదిలేసి ఎన్నో ఆర్టిక ఇబ్బందులను ఎదుర్కొంటు ఈ సినిమాలో నటించారు.

ఇలా వీరందరి వల్ల తాను నేడు దర్శకుడిగా మీ ముందుకు వచ్చానని సాయి రాజేష్ తెలిపారు.

అయితే ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడానికి ప్రేక్షకులే కారణం అంటూ అందరికీ ఈయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విధంగా సాయి రాజేష్ మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ఈయనని అంతగా అవమానించి ఇలాంటి హిట్ సినిమాని మిస్ చేసుకున్నటువంటి ఆ హీరో ఎవరో అని ఆరా తీస్తున్నారు.

ఇటలీకి నెలరోజుల ట్రిప్పు.. ఆఫీస్ బాస్‌ను పిచ్చోడ్ని చేశాడు..??