అబ్బా.. పిల్ల సింహలలో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

సాధారణంగా సింహాలంటేనే గంభీరమైన జంతువులనే భావన మనకి అందరికి తెలిసిన విషయమే.

కానీ కొన్నిసార్లు అవి కూడా సరదాగా, ఆటపట్టించేలా ప్రవర్తిస్తుంటాయి.కొన్ని వీడియోల్లో మనుషులు వాటితో స్నేహంగా ఆడుకోవడం చూస్తుంటాం.

అలాగే, కొన్నిసార్లు చిన్న జంతువులు కూడా సింహాలతో సరదాగా ఆటలాడుతుంటాయి.ఇప్పుడు తాజాగా ఒక సింహం పిల్ల ( Lion Cub )వీడియో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఒక చిన్న సింహం పిల్ల నిద్రపోతున్న పెద్ద సింహం దగ్గరికి వెళ్ళి ఏం చేసిందో ఒక్క సారి చూద్దాం.

"""/" / ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో( Social Media ) చాలా వైరల్ అవుతోంది.

అడవిలో రోడ్డు పక్కన ఒక పెద్ద మగ సింహం( Large Male Lion ) నిద్రపోతూ ఉంటుంది.

కొన్ని సింహం పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటాయి.ఇంతలో ఒక ఊహించని సంఘటన జరుగుతుంది.

ఆడుకుంటున్న పిల్ల సింహాలలో ఒకటి అటుగా వచ్చి నిద్రపోతున్న సింహం దగ్గరకు వెళ్తుంది.

అది నిద్రపోతున్న సింహాన్ని చూసి కాసేపు ఆటపట్టిద్దామని అనుకుంటుంది. """/" / ఈ క్రమంలో అది మెల్లగా దాని వద్దకు వెళ్లి తోకను పట్టుకుని కొరకడం మొదలు పెట్టింది.

దీంతో పడుకున్న సింహం.పైకి లేచి.

‘‘ఎవరది నా నిద్రా భంగం చేస్తున్నారు’’.అని అన్నట్లుగా చూసిన కానీ.

ఆ పిల్ల సింహం పదే పదే తోకను పట్టుకుని ఆడడం మాత్రం మానలేదు.

సింహం ఎన్ని సార్లు తోకను పక్కకు తీసుకున్నా లాగి మరీ ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేసింది.

దీంతో ఆ సింహానికి కోపం వచ్చి సడన్‌గా పైకి ‘‘ఎహే.ఎన్నిసార్లు చెప్పాలి.

పక్కకు వెళ్లి ఆడుకో’’.అన్నట్లుగా గర్జిస్తూ దాన్ని భయపెట్టింది.

దీనితో దెబ్బకు భయపడిపోయిన పిల్ల సింహం.అక్కడి నుంచి దూరంగా పారిపోయి తోటి పిల్ల సింహంతో సరదాగా ఆడుకుంది.

ఈ వీడియోను చుసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది సింహానికి కోపం వస్తే ఇలానే ఉంటుంది అని అంటూ ఉంటె.

మరికొందరు వివిధ రకాల ఈమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.

గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?