బేబీ జీసస్‌ దొంగలించాడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు!

అమెరికాలోని కొలరాడోలో క్రిస్మస్‌ వేడుకల్లో(Christmas Celebrations In Colorado, USA) ఊహించని ట్విస్ట్‌ వెలుగు చూసింది.

ఇక్కడ ఓల్డ్‌ టౌన్‌ స్క్వేర్‌లోని క్రిస్మస్‌ డెకరేషన్‌లో ఉన్న బేబీ జీసస్‌ విగ్రహం (Baby Jesus Statue)ఒక్కసారిగా మాయమైంది.

దీంతో అంతటా ఆందోళన నెలకొంది.కానీ, కథ ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది.

దొంగతనానికి గురైన ఆ విగ్రహం అనూహ్యంగా దగ్గరలోని ఫైర్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అంతేకాదు, విగ్రహాన్ని తిరిగి తెచ్చిన వ్యక్తి ఓ ఊహించిన పని చేశాడు.విగ్రహంతో పాటు ఒక క్షమాపణ లేఖను కూడా వదిలి వెళ్ళాడు ఆ వ్యక్తి.

ఈ మిస్టీరియస్‌ ఘటనకు సంబంధించిన వివరాలను ఫోర్ట్‌ కొలిన్స్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌(Police Department) మొదట ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది.

బేబీ జీసస్‌ విగ్రహాన్ని పట్టుకున్న ఓ యువకుడి అస్పష్టమైన సెక్యూరిటీ కెమెరా ఫొటోను పోస్ట్‌ చేస్తూ.

"క్రిస్మస్‌ను నాశనం చేయాలని చూస్తున్న గ్రించ్‌" అంటూ కామెంట్‌ చేసింది.అంతేకాదు, ఆ వ్యక్తిని గుర్తించడంలో ప్రజల సహాయం కూడా కోరింది.

"""/" / ఆ తర్వాత, పోడ్రే ఫైర్‌ (Podre Fire)అథారిటీ స్టేషన్‌లో విగ్రహం దొరికినట్లు పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు.

ఇద్దరు ఫైర్‌మెన్లు విగ్రహాన్ని పట్టుకున్న ఫొటోలను కూడా రిలీజ్‌ చేశారు.ఇక అసలు ట్విస్ట్‌ ఏంటంటే.

విగ్రహానికి ఓ క్షమాపణ లేఖ అంటించి ఉంది.అందులో.

“నన్ను క్షమించండి.నేను తొందరపాటులో తప్పు చేశాను.

ఇది మళ్ళీ జరగదు” అని రాసి ఉంది.దీంతో ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

"""/" / బేబీ జీసస్‌ విగ్రహాన్ని ఎవరు దొంగిలించారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

అయితే, ఈ క్రిస్మస్‌ సీన్‌ను ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థలు మాత్రం దీనిపై ఎలాంటి కంప్లైంట్‌ ఇవ్వకపోవడం విశేషం.

దీంతో ఈ ఘటన మరింత ఆసక్తికరంగా మారింది.ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఫుల్‌ జోష్‌లో రియాక్ట్‌ అవుతున్నారు.

బేబీ జీసస్‌ విగ్రహం ఫైర్‌ స్టేషన్‌లో ప్రత్యక్షం కావడంపై ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వులు, ఆశ్చర్యాలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

"ఇది కచ్చితంగా నేషనల్‌ న్యూస్‌ అవ్వాలి" అంటూ ఒక యూజర్‌ ఫన్నీ కామెంట్‌ చేశాడు.

ఇంకొందరైతే.దొంగ రాసిన క్షమాపణ లేఖను చూసి "ఇది కాలేజీ కుర్రాడి అపాలజీలా ఉంది" అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

విగ్రహం క్షేమంగా తిరిగి రావడంతో చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు."మా పట్టణానికి బేబీ జీసస్‌ మళ్ళీ వచ్చేశాడు.

చాలా హ్యాపీగా ఉంది" అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.మొత్తానికి ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్‌తో ముగిసింది.

చాలామంది ఈ ఘటనను ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి26, ఆదివారం 2025