థమన్ పాటకు కడుపులో బిడ్డ డ్యాన్స్ స్టెప్పులు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి సినిమాలైన వారసుడు, వీరసింహారెడ్డి సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
వారసుడు సినిమాలోని రంజితమే పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ పాటకు కడుపులో బిడ్డ డ్యాన్స్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.
థమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
థమన్ షేర్ చేసిన ఈ వీడియోకు 15000కు పైగా లైక్స్ వచ్చాయి. """/"/
రంజితమే సాంగ్ ప్లే చేసిన సమయంలో నా బేబీ ప్రతిసారి డ్యాన్స్ చేస్తోందని బేబీ తల్లి చెప్పుకొచ్చారు.
ఈ విషయం తెలిసిన నెటిజన్లు థమన్ పాటకు ఎవరైనా డ్యాన్స్ చేయాల్సిందేనని కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న వీడియో గురించి థమన్ స్పందిస్తూ ఈ వీడియో చూసి నేను మధురానుభూతికి లోనయ్యానని తెలిపారు.
ఈ వీడియో నా రోజును ఎంతో సంతోషంగా మార్చేసిందని థమన్ వెల్లడించారు. """/"/
మరోవైపు నిన్న థియేటర్లలో విడుదలైన వారసుడు సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది.
గౌతమ్ Ssc , అల వైకుంఠపురములో సినిమాలను గుర్తు చేసే విధంగా ఈ సినిమా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
వారసుడు తెలుగులో విజయ్ మార్కెట్ ను కచ్చితంగా పెంచుతుందని దిల్ రాజు భావిస్తున్నారు.
వారసుడు మూవీ తొలిరోజు కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
15 ఏళ్ల న్యాయపోరాటంలో గూగుల్‌కు ఊహించని షాక్.. యూకే కపుల్‌కు భారీ పరిహారం..