Director Sai Rajesh: గొప్ప మనసును చాటుకున్న సాయి రాజేష్.. చావు బ్రతుకుల్లో ఉన్న చిన్నారికి సహాయం?

టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేష్( Director Sai Rajesh ) గురించి మనందరికీ తెలిసిందే.

తాజాగా విడుదలైన బేబీ సినిమాకు( Baby Movie ) దర్శకత్వం వహించి దర్శకుడిగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు సాయి రాజేష్.

ఈ సినిమాతో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు.దీంతో బేబీ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత దర్శకుడు సాయి రాజేష్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది.

ఈ సినిమాను చక్కగా తెరకెక్కించినందుకు దర్శకుడు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నారు.

ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే. """/" / తాజాగా సాయి రాజేష్ గొప్ప మనసును చాటుకున్నారు.

ఏడాది వయసు ఉన్న బాలుడు హాస్పిటల్ లో మృత్యువులతో పోరాడుతున్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్న సాయి రాజేష్ వెంటనే ఆర్థిక సహాయాన్ని( Financial Help ) అందించారు.

డాక్టర్ బి.ఆర్.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామానికి చెందిన గుత్తుల సూర్యబాబు( Gutthula Suryababu ) అనే ఏడాది వయసున్న బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి నూనెలో పడిపోయాడు.

దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఒంటి మీద చర్మం అంతా ఊడిపోయింది.

స్థానిక హాస్పిటల్‌కు ఆ బాలుడిని తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు.

"""/" / ఇప్పుడు ఆ బాలుడికి హైదరాబాద్‌లోని( Hyderabad ) ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.

అయితే, బాలుడి వైద్యానికి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందని హాస్పిటల్‌లో వైద్యులు చెప్పారు.

రోజుకి రూ.30 వేలు ఖర్చు అవుతోందట.

కానీ, బాలుడి తల్లిదండ్రులకు అంత స్తోమత లేదట.వారు దాతల కోసం చూస్తున్నారని మీకు తోచిన సాయం చేయండంటూ మహేష్ బాబు ట్రెండ్స్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు.

అంతేకాదు ఫోన్ పే నంబర్ 9701355399, గూగుల్ పే నంబర్ (6260226445) కూడా ఇచ్చారు.

ఈ ట్వీట్ చూసిన డైరెక్టర్ సాయి రాజేష్ గూగుల్ పే ద్వారా రూ.

50 వేలు పంపించారు.తాను గూగుల్ పే చేసినట్టు స్క్రీన్ షాట్ తీసి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

దాంతో సాయి రాజేష్‌ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మానవత్వంతో స్పందించినందుకు ధన్యవాదాలు చెబుతూ.

సాయి రాజేష్ మరింత ఎత్తుకు ఎదగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

2026 సంవత్సరంలో చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ ఫైట్.. పైచేయి సాధించేది ఎవరో?