తల్లిదండ్రుల నుంచి శిశువును లాక్కెళ్లి.. మూడో అంతస్తు నుంచి పడేసిన కోతి!
TeluguStop.com
చిన్న పిల్లలకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేకపోతుంటాం.ఇంకా నెలల పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా చూస్కుంటాం.
ఏమాత్రం దెబ్బ తగిలినా విలవిల్లాడిపోతుంటాం.అలాంటి తల్లిదండ్రుల కళ్లెదుటే నాలుగు నెలల పాప చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది.
అందులోనూ ఓ బిల్డింగ్ పైనుంచి ఆ పాను కింద పాడేస్తే.ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకోగలరు.
పాపం.అయితే ఇలాంటి ఓ హృదయ విదారకమైన ఘట ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో జరిగింది.
మూడు అంతస్తుల భవనంపై నుంచి ఓ నాలుగు నెలల పసికందును కోతి కిందకు విసిరేసింది.
దీంతో ఆ నవజాత శిశువు అక్కడికక్కడే మృతి చెందింది.అయితే బరేలీ జిల్లాలోని డంకా గ్రామానికి చెందిన నిర్దేశ్ ఉపాధ్యాయ భార్య ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
శుక్రవాం సాయంత్రం నిర్దేశ్ దంపతులు.తమ కొడుకును తీస్కొని ఇంటి డాబాపైకి వెళ్లి వాకింగ్ చేస్తున్నారు.
అదే సమయంలో ఓ కోతుల గుంపు వారి మీదకు వచ్చింది.భార్యాభర్తలిద్దరూ కోతుల్ని తరిమి కొట్టేందుకు ప్రయత్నించారు.
అయినా వానరాలు బెదరలేదు.దీంతో చేసేదేమీ నిర్దేశ్ దంపతులు పిల్లాడ్ని తీసుకొని మెట్లవైపు పరిగెత్తారు.
అకస్మాత్తుగా నిర్దేశ్ చేతి నుంచి పిల్లాడు జారిపోయారు.కింద పడ్డ బాబును తీసుకునేలోపే.
ఓ కోతి వచ్చి పసికందును అందుకుంది.మూడో అంతస్తు పైనుంచి కిందకు విసిరేసింది.
దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.అయితే ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
చాక్లెట్ ప్లేన్‌గా ఉందని కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ అతనికి చెల్లించిన నష్టపరిహారం ఎంతంటే..?