వైరల్ వీడియో: విజయవాడలో బాహుబలి సీన్ రిపీట్..
TeluguStop.com
భారీ వర్షాల కారణంగా ముక్యముగా తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలు జలమయం అయిన సంగతి అందరికీ వేదితమే.
రాత్రికి రాత్రి భారీ వరదలతో విజయవాడలోని( Vijayawada ) అనేక కాలనీలలో భారీగా వర్షం నీరు వచ్చి చేకోరింది.
మూడంతస్తుల భవనాలు సైతం వరద నీటితో మునిగిపోయాయి.దీంతో ప్రజలు ప్రాణాలను వారి అరచేతిలో పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే విజయవాడ వరదలలో( Vijayawada Floods ) కనిపించే ఒక దృశ్యం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అప్పుడే పుట్టిన చిన్న పిల్ల దగ్గర నుంచి వృద్ధులు, దివ్యాంగుల వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరదల్లో నుంచి బయటపడాలని డ్రమ్ములు, లారీ ట్యూబ్స్, ప్లాస్టిక్ బాక్సులు ఇలా ఏది పడితే అది వారు వరద ప్రాంతం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొని వెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
"""/" /
ముందుగా చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఒక చిన్న పిల్ల వాడిని తీసుకొని వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
విజయవాడలోని సింగ్ నగర్ లో( Singh Nagar ) ఒక చిన్నారిని ఓ తొట్టెలో పడుకోబెట్టి ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి మరీ వరదల నీళ్ల నుంచి మరో ప్రాంతానికి సురక్షితంగా తరలించారు.
ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఇక మరికొందరు అయితే వాళ్లు చేసిన సాహసానికి మెచ్చుకుంటున్నారు.ఇప్పటికే పలు సినీ తారలు వరద బాధితులు కోసం విరాళాలు కూడా అందజేశారు.
"""/" /
ఇక విజయవాడ నగరంలో ఎంతోమంది ప్రభుత్వాధికారులు రేయింబవళ్లు వరదలో చిక్కుకున్న ప్రజలకు సేవలను అందిస్తున్నారు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలో జరుగుతున్న సేవలకు సంబంధించి ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ.
ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం కృష్ణానది ఉధృతి తగ్గడంతో ఓవైపు ప్రజలు, మరోవైపు అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
పాక్ నటుడి నోట భారత మాట.. దీపక్ పెర్వానీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు..