గ‌ర్భిణీలు ఈ ఆహారాలు తీసుకుంటే..పిల్ల‌లు తెలివిగా పుడ‌తార‌ట‌!

సాధార‌ణంగా ప్ర‌తి త‌ల్లీ త‌న‌కు తెలివైన పిల్ల‌లు పుట్టాల‌ని ఆశ‌ప‌డుతుంది.అలా ఆశ‌ప‌డ‌టంలో ఎలాంటి త‌ప్పూ లేదు.

అయితే తెలివైన పిల్ల‌లు ప‌ట్టాలంటే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

మ‌రి ఆ ఫుడ్స్ ఏంటీ.? అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్ల‌లు తెలివితేట‌ల‌తో పుట్టాలంటే.గ‌ర్భిణీలు విట‌మిన్ డి పుష్క‌లంగా ఉండే ఆహారం రెగ్యుల‌ర్‌గా తీసుకోవాలి.

ఉడికించిన గుడ్డు, చేప‌లు, మీట్‌, తృణధాన్యాలు, పాలకూర వంటి వాటిలో విట‌మిన్ డి ఉంటుంది.

కాబ‌ట్టి, వీటిని డైట్‌లో చేర్చుకోవాలి. """/" / అలాగే బాదం ప‌ప్పు, వాల్ న‌ట్స్‌, పిస్తా ప‌ప్పు, జీడి ప‌ప్పు వంటి న‌ట్స్ ను గ‌ర్భిణీలు ఆహారం లో భాగంగా చేసుకోవాలి.

న‌ట్స్‌లో ఉండే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మ‌రియు ఇత‌ర పోష‌కాలు శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి ఉప‌యోగ‌పడుతాయి.

మ‌రియు భవిష్యత్తులో పిల్లల తెలివితేటల‌కూ సహాయపడుతాయి """/" / క‌డుపులోని శిశువు ఆరోగ్యం మరియు మెదడు సక్ర‌మంగా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం.

కాబ‌ట్టి, ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో క్యారెట్‌, బీట్‌రూట్‌, ట‌మాటా, ప‌ప్పు ధాన్యాలు, క‌మ‌లా పండ్లు, అర‌టి పండ్లు, వేరు శెన‌గ‌లు, రొయ్య‌లు వంటివి తీసుకుంటే పుట్ట‌బోయే బిడ్డ మంచి తెలివి తేట‌ల‌తో పుడుతుంది.

తెలివైన పిల్ల‌లు పుట్టాలీ అంటే ఐర‌న్ కూడా ఎంతో అవ‌స‌రం.కాబ‌ట్టి, దానిమ్మ ర‌సం, ఖ‌ర్జూరం, ఎండు ద్రాక్ష‌, బీన్స్, ఓట్స్‌ వంటివి ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తీసుకుంటే ఐర‌న్ పుష్క‌లంగా అందుతుంది.

ఇక ఆ ఫుడ్స్‌తో పాటుగా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి.ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి.

నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి.ధూమపానం మరియు మద్యపానం అల‌వాట్ల‌ను మానుకోవాలి.

అప్పుడ‌ప్పుడు మంచి సంగీతాన్ని వినాలి.బ‌రువును అదుపులో ఉంచుకోవాలి.

రెగ్యుల‌ర్ గా కొంత స‌మ‌యం పాటు వాకింగ్ చేయాలి.త‌ద్వారా క‌డుపులోని శిశువు మెద‌డు చ‌క్క‌గా అభివృద్ధి చెందుతుంది.

నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు మంత్రులు..: జగదీశ్ రెడ్డి