ఒక కన్నతల్లి వ్యధ : 7 నెలల పాపను చావు అంచుల వరకు తీసుకు వెళ్లిన క్రీమ్‌

ఒక కన్నతల్లి వ్యధ : 7 నెలల పాపను చావు అంచుల వరకు తీసుకు వెళ్లిన క్రీమ్‌

ఏ తల్లి అయినా కూడా తన కడుపులో పుట్టిన బిడ్డకు పూర్తి ఆరోగ్యంను ప్రసాదించాలని ప్రయత్నిస్తుంది.

ఒక కన్నతల్లి వ్యధ : 7 నెలల పాపను చావు అంచుల వరకు తీసుకు వెళ్లిన క్రీమ్‌

తన బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి నొప్పులు కూడా లేకుండా ఉండాలని తాపత్రయ పడుతుంది.

ఒక కన్నతల్లి వ్యధ : 7 నెలల పాపను చావు అంచుల వరకు తీసుకు వెళ్లిన క్రీమ్‌

అందుకోసం చిన్న నొప్పి వచ్చినా కూడా డాక్టర్‌ వద్దకు తీసుకు వెళ్లడం లేదంటే ఏదో ఒక సిరప్‌ లేదా ఆయింట్‌మెంట్‌లను వాడటం చేస్తూ ఉంటారు.

తాజాగా యూకేకు చెందిన ఒక తల్లి కూడా అలాగే తన పాపకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకుంటూ ఉంది.

ఆ పాప కు ఒక చిన్న పుండుకు గాను ఆమె బొంజెల అనే క్రీమ్‌ను రాసింది.

ఆ క్రీమ్‌ మామూలుగా అయితే పిల్లలకు పుండ్ల గాయంను మాన్పించడంతో పాటు, నొప్పి లేకుండా చూస్తుంది.

అయితే ఆ క్రీమ్‌ వల్లే తన పాప మృత్యువుతో పోరాడుతున్నాడని, ప్రస్తుతం తన పాప హాస్పిటల్‌లో ఉన్నాడంటూ జెస్సిక చెప్పుకొచ్చింది.

సోషల్‌ మీడియాలో తాను పడ్డ మానసిక వ్యధను ఆమె జనాలతో పంచుకుంది.తాను బిడ్డ నొప్పిని తగ్గించేందుకు వాడిన బొంజెల క్రీమ్‌ గురించి నెట్‌లో సెర్చ్‌ చేసి ఆశ్చర్యకర విషయాలను తెలుసుకుందట.

ఆ విషయాన్ని నలుగురితో పంచుకుంది.ఆమె చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అయ్యింది.

జెస్సిక తన సోషల్‌ మీడియా పేజ్‌ లో స్పందిస్తూ.అర్జుంట్‌ వార్నింగ్‌, ప్రస్తుతం నేను నా ఏడు నెలల పాప తో హాస్పిటల్‌లో ఉన్నాను.

బొంజెల క్రిమ్‌ అధికంగా రాయడం వల్ల అనారోగ్యం పాలైన నా పాప కు చికిత్స చేయిస్తున్నాను.

పలు దేశాలు నిషేదించిన బొంజెల క్రీమ్‌ను ఇంకా కొన్ని చోట్ల అమ్ముతున్నారు.దాని వల్ల నేను దాన్ని వాడటం జరిగింది.

దాంతో నా పాప ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది, ఇంకాస్త సీరియస్‌ అయితే పరిస్థితి ఏంటో ఊహించుకోవడమే కష్టంగా ఉంది.

అత్యంత దారుణమైన ఇలాంటి పరిస్థితి మీకు రావద్దని కోరుకుంటున్నాను.మీరు ఇప్పటికే వాడినా, ఇకపై వాడాలనుకుంటున్న ఖచ్చితంగా దీనికి దూరంగా ఉండాలని ఆమె సలహా ఇచ్చింది.

ప్రస్తుతం తన పాప ప్రాణాపాయ స్థితి నుండి బయట పడింది అని, అతడికి ఇది మరో జన్మగా తాను భావిస్తున్నాను.

ఇకపై అతడి విషయంలో మరింత శ్రద్ద తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.తాను పడ్డ మానసిక క్షోభ మరెవ్వరు పడవద్దని ఆమె కోరుకుంటుంది.

ఒక్క స్పూన్ గసగసాలతో జుట్టుకు ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?