బేబీ బడ్జెట్ 10 కోట్లు, భోళా బడ్జెట్ 150 కోట్లు.. టాలీవుడ్ కు ఈ రెండు సినిమాలు నేర్పిన పాఠాలివే!
TeluguStop.com
నెల రోజుల గ్యాప్ లో బేబీ, భోళా శంకర్ సినిమాలు థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ రెండు సినిమాలలో బేబీ బడ్జెట్ 10 కోట్ల రూపాయలు కాగా భోళా శంకర్ బడ్జెట్ 150 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
బేబీ సినిమా( Baby Movie ) ఇప్పటివరకు 91 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
భోళా శంకర్ సినిమా మాత్రం కేవలం 27 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.
"""/" /
బేబీ సినిమాలో కథ, కథనం, కంటెంట్ అద్భుతంగా ఉండగా భోళా శంకర్ సినిమాలో మాత్రం విసుగు తెప్పించే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి.
కరోనా తర్వాత సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల ఒపీనియన్ మారింది.సినిమాల్లో స్టార్స్ అట్రాక్షన్ కంటే మంచి కంటెంట్ కు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.
రొటీన్ మాస్ మసాలా సినిమాలను, అర్థంపర్థం లేని సన్నివేశాలు ఉన్న సినిమాలను ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు.
తక్కువ బడ్జెట్ తో తీస్తే చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని బేబీ ప్రూవ్ చేస్తే అన్ని హంగులు ఉన్నా కథ, కథనం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సినిమా ఫ్లాప్ అని భోళా శంకర్ ప్రూవ్ చేసింది.
బేబీ సినిమా పెట్టుబడితో పోల్చి చూస్తే ఐదు రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించగా భోళా శంకర్( Bhola Shankar ) మాత్రం పెట్టుబడిలో కేవలం 20 శాతం కలెక్షన్లను మాత్రమే సాధించడం గమనార్హం.
"""/" /
భోళా శంకర్ సినిమా గురించి చిరంజీవి( Chiranjeevi ) నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.
భోళా శంకర్ సినిమా రిలీజ్ తర్వాత దర్శకుడు మెహర్ రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.
మెహర్ రమేష్ ఈ సినిమా ఫ్లాప్ గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
మెహర్ రమేష్ రీమేక్ కథలకు కూడా న్యాయం చేయలేకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బు లాక్కొని హీరోయిన్ కు చుక్కలు చూపించిన బిచ్చగాడు.. అసలేం జరిగిందంటే?