కలెక్టర్లతో నేడు ,రేపు సదస్సు.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న బాబు
TeluguStop.com
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) ఏపీకి సంబంధించి అనేక నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు.
తమ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ఇక విషయానికొస్తే నేడు, రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించనున్నారు. """/" / ఈ సందర్భంగా ఆరు నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్ 2047 డాక్యుమెంట్ ( Swarnandhra Pradesh, Vision 2047 Document )పై కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు చంద్రబాబు వివరించనున్నారు .
రాబోయే నాలుగున్నర ఏళ్లలో ఏ విధంగా పనిచేయాలనే అంశం పైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈరోజు ఉదయం 10.30 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది.
మొదటి రోజు ఆర్టిజిఎస్ , వినతుల పరిష్కారం , గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నమెంట్ పై ప్రజల్లో సానుకూల దృక్పథం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
అలాగే వ్యవసాయం , పశుసంవర్ధక ,ఉద్యానవనం పౌరసరఫరాలు( Agriculture, Animal Husbandry, Horticulture Civil Supplies ) ,అటవీ ,జల వనరులు, పంచాయతీరాజ్ వంటి శాఖల పైన చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
సాయంత్రం 6.30 గంటల నుంచి 7.
30 వరకు శాంతిభద్రతలపై రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. """/" / ఇక రేపు పరిశ్రమలు, ఐటి ,పెట్టుబడులు, విద్యుత్ , మానవ వనరుల రవాణా, రోడ్లు భవనాలు , గృహ నిర్మాణం ,వైద్యం ,ఆరోగ్యం వంటి రంగాలపైన చంద్రబాబు సమీక్ష చేయనున్నారు.
ఇక తరచుగా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ , పరిపాలనలో వేగం పెంచేందుకు, ప్రజలకు ప్రభుత్వ పథకాలను మెరుగ్గా అందించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజాప్రతినిధులు , అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వీటితో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల అమలుపైనా చర్చించనున్నారు.
రెబల్స్ చేతుల్లోకి పాలన .. సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు