బాబును టెన్షన్ పెడుతున్న బిజెపికి డబుల్ గేమ్

దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) నాయుడుకి ఇప్పుడు భాజపా వ్యవహార శైలి ఏ మాత్రం కొరుకున పడటం లేదట.

ఒకవైపు తనకు హామీలు ఇస్తూ మరోవైపు జగన్కు నిధులు కేటాయిస్తున్న కేంద్ర అధికార పార్టీ పెద్దలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో చంద్రబాబు ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని అనుకూల పరిస్థితి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

"""/" / ఇక్కడ అధికార ప్రతిపక్షాలు రెండిటితో సమాన సాన్నిహిత్యాన్ని బిజెపి ( BJP )మెయిన్టెయిన్ చేస్తుంది.

మొన్నటి వరకు బాబును దూరం పెట్టినా తెలంగాణ( Telangana ) అవసరాలు రీత్యా ఆయన అవసరం ఉంటుందని భావించి ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు.

మరొకపక్క జగన్కు అండగా నిలుస్తూ నిధులను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.ఇద్దరికీ కూడా కావలసినంత సమయం ఇచ్చి చర్చలు జరుపుతున్నారు దాంతో బిజెపి డబుల్ స్టాండ్ పట్ల చంద్రబాబు అయోమయంలో పడ్డారని వార్తలు వస్తున్నాయి.

"""/" / బాబు అనుకూల మీడియా అధిపతులు కూడా ఈ విషయంలో చంద్రబాబుకు పలు సూచనలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి మోడీ గ్రాఫ్ దేశంలో రోజురోజుకు దిగజారుతుందని ఆ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రజల్లో విమర్శలకు గురవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాల గాను నష్టం చేస్తున్న భాజపాతో కలిసి నడవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆగ్రహానికి గురవవలసి ఉంటుందన్న హెచ్చరికలను ఈ మీడియాధిపతులు చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది.

అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి నడవకపోతే విచారణ సంస్థల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటామా ?అన్న కోణంలో బాబు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

మరోవైపు జగన్ ( Jagan )కి అనుకూలంగా వ్యవహరిస్తున్న బిజెపితో ఇప్పుడు కలిసి నడవకపోతే వచ్చే ఎన్నికలలో ఏ రకమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాలోచనలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

మొత్తానికి రెండు వర్గాలతోనూ సన్నిహితంగా ఉంటున్న బిజెపి వైఖరిపై ఎలా స్పందించాలో తెలియని విచిత్ర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఉన్నట్లుగా అర్థమవుతుంది .

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?