ఏపీలో బాబు స్పీడ్.. అందుకేనట ?
TeluguStop.com
ఏపీలో మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.ఈసారి ముందుగా అభ్యర్థులను ప్రకటించే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
175 నియోజకవర్గాల్లో టీడీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాలపై బాబు ఫోకస్ పెట్టారు.స్థానిక నేతల పనితీరు, పార్టీ పరిస్థితిపై లోతుగా విశ్లేషిస్తున్నారు.
మరోవైపు సర్వే నివేదికలు తెప్పించుకుని ఎన్నికలకు ఏడాదికి ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ వేసినట్టు తెలిసింది.
అయితే చంద్రబాబు చివరి నిమిషం దాకా అభ్యర్థులను ప్రకటించని దాఖలాలు అనేకం ఉన్నాయి.
ఇది బాబు సాంప్రదాయకంగా పాటిస్తున్న పాత పద్ధతే.ఎన్నికలకు నెలముందు నుంచే ఆయన అభ్యర్థులను ప్రకటిస్తున్నాడు.
గత తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంలోనూ పనబాక లక్ష్మిని ముందుగానే ప్రకటించగా ఆమె ఓటమి పాలైంది.
వైసీపీ మెజారిటీని చాలా వరకు నిలువరించగలిగారు.కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఇదే పద్ధతిని పాటించాలనే డిసైడ్‌కు వచ్చినట్టు సమాచాంర.
ఇందుకు నియోజకవర్గాల సమీక్షలు చేపడుతూ అభ్యుర్థుల ఎంపిక పట్ల అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది.
జాబితాను కూడా రూపొందించే పనిలో పడ్డట్టు సమాచారం.అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి, సామాజిక కోణంలో కూడా ఈసారి ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.
"""/"/
అయితే ఈసారి చంద్రబాబు పొత్తులతో బరిలోకి దిగుతున్నారు.ఇందుకు నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా టీడీపీ బలంగా ఉన్న 50 నుంచి 70 నియోజకవర్గాల్లో ముందుగాఅభ్యర్థులను ప్రకటించనున్నారని టాక్.
ఏడాదికి ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారం కూడా ముందుగానే ప్రారంభించి స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేక, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించే వీలుంటుంది.
దీంతో పార్టీ నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.మేలో మహానాడు పూర్తైతే బాబు రాజకీయంగా బిజీగా మారి టీడీపీ బలోపేతానికి దూకుడుగా వ్యవహరిస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నన్ను క్షమించండి,చాలా పెద్ద తప్పు జరిగింది: శ్రీకాంత్ అయ్యంగార్