బాబు సంచలన నిర్ణయం ! సీనియర్ల గుర్రు ?

గత కొంతకాలంగా పార్టీ ప్రక్షాళన పైన టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు.

పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలనే విషయం లో బాబు క్లారిటీ గా ఉన్నారు.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకత ను టీడీపీకి అనుకూలంగా మార్చే పనిలో పడ్డారు.

అలాగే 2024 ఎన్నికల్లో టిడిపి గెలవాలంటే ఏం చేయాలనే విషయంపై న ఆయన ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు దానిని అమలు చేసే పనిలో ఉన్నారు.తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు కొదవలేదు .

పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు, చంద్రబాబు హవా టిడిపిలో మొదలైనప్పటి నుంచి ఆయన వెంట నడుస్తున్న వారు  చాలామందే ఉన్నారు.

వారందరికీ పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తూనే బాబు వచ్చారు.అయితే గత కొంతకాలంగా టిడిపి లో వారి గ్రాఫ్ తగ్గిపోవడం , వారు సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన లేకపోవడం,  కొత్త నాయకత్వం నియోజకవర్గంలో ఎదగకుండా చేయడం ఇలా అనేక అంశాలను బాబు గుర్తించారు.

 ఇకపై టిడిపి సీనియర్ నాయకులకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా ఆచితూచి వ్యవహరించాలని, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అందుకే దాదాపు 40 శాతం మంది సీనియర్ నాయకులను పక్కన పెట్టాలని బాబు నిర్ణయించుకున్నారట.

తాజాగా చంద్రబాబు పర్యటన లో  ఓ అభ్యర్థిని కూడా ప్రకటించడం టిడిపి సీనియర్లకు మింగుడు పడడం లేదు.

బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న బాబు ఈ సందర్భంగా పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించారు.

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం టికెట్ పార్టీ సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తి కుటుంబానికి ఇస్తారని ఇప్పటి వరకు అంతా భావించారు.

కానీ బాబు కర్నూలు పర్యటనలో ధర్మవరం సుబ్బారెడ్డి అనే నాయకుడికి టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

"""/" /  దీంతో కేఈ కుటుంబం తీవ్ర అసంతృప్తికి గురి అయ్యింది.చాలా కాలంగా పార్టీ సీనియర్ నాయకులు పై టిడిపి యువ నాయకత్వం అసంతృప్తిగా ఉంది.

పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు సీనియర్ నాయకులు హాజరు కాకపోవడమే  కాకుండా , జనసమీకరణ చేయలేకపోవడం , పార్టీ కార్యక్రమాలకు సొమ్ము ఖర్చు పెట్టకపోవడం వంటి వ్యవహారాలు చంద్రబాబు దృష్టికి వచ్చాయి.

పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆర్థికంగా బాగా బలపడినా, ఇప్పుడు మొహం చాటేస్తూ ఉండడం వంటి వ్యవహారాలతో పాటు, వీరికి టికెట్ ఇచ్చినా,  గెలుపు అంతంత మాత్రమే అన్న అభిప్రాయంతో బాబు ఈ నిర్ణయానికి వచ్చారట.

పంజాబ్ కింగ్స్ ఓటమికి ముంబై గెలుపుకి ఇదెక్కోటే కారణం…