ఛీ అన్న దగ్గర పడుండటం నాకు నచ్చదు.. నేనేం తప్పు చేశా కేసీఆర్: బాబు మోహన్

తనను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది కేసీఆర్ అని ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ తెలిపారు.

తన కోసం 3 నెలలు వెంటుండి తనను గెలిపించారని ఆయన అన్నారు.నీకు అవమానం జరిగింది, నిన్నెప్పుడూ డిస్ట్రబ్ చేయలేదు.

రా .టీఆర్ఎస్ తరపున పోటీ చేయి అని కేసీఆర్ అన్నట్టు బాబు మోహన్ తెలిపారు.

మరి అంతగా సపోర్ట్ చేసిన వ్యక్తి మొన్న ఎలక్షన్స్ లో ఎందుకు సీట్ ఇవ్వలేదన్న దానిపై బాబు మోహన్ ఇలా అన్నారు.

రాష్ట్రాన్ని పరిపాలించేటపుడు ఎన్నో ఉంటాయి.ఒక గదిలో కూర్చొని కృష్ణా రామా అని అనుకోవడానికి చాలా తేడాలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఆయనకి అప్పుడు ఏ అడ్డం వచ్చిందో ఎవడు అడ్డం వచ్చారో అని బాబు మోహన్ వివరించారు.

ఎవడి వల్ల తనకు టిక్కెట్ ఇవ్వలేకపోయాడో, అది ఆయన ఇష్టం అని బాబు మోహన్ అన్నారు.

ఆయన మనసులోకి పోయి నేనేమైనా చూస్తానా అని ఆయన వ్యాఖ్యానించారు.లేదంటే ఏదైనా మీటర్ పెట్టి చూస్తానా అని ఆయన అన్నారు.

"""/"/ ఇకపోతే 40 ఏళ్ల స్నేహం ఒకే ఒక్క కారణంతో విడిపోయింది అని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేల సర్వే ప్రకారం చూసుకుంటే తనకు తక్కువ అ ర్యాంకింగ్ రావడం వల్ల సీట్ ఇవ్వలేదని ఈ విషయంపై బాబు మోహన్ స్పందించారు ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే తనతో నేరుగా చెప్పొచ్చు కదా అని ఆయన అన్నారు.

మనిషి అన్న ప్రతి ఒక్కరికీ ఆత్మాభిమానం ఉంటుందన్న బాబు మోహన్, చెప్పి చేస్తే ఎంతటి తప్పునైనా క్షమించేటటువంటి గుణం అవతలివారిలో ఉంటుందని ఆయన అన్నారు.

కానీ అలా చెప్పకుండా చేసినప్పుడు ఆత్మాభిమానం దెబ్బతింటుందని ఆయన తెలిపారు.కాబట్టి తన ఆత్మాభిమానం కూడా దెబ్బతిన్నదని ఆయన అన్నారు.

అప్పటికీ ఒక ఇరవై రోజులు చూశాను.ఫోన్ ట్రై చేశాను.

కానీ నాతో మాట్లాడలేదు అని బాబు మోహన్ అన్నారు.అలా నన్ను చీ అన్న చోట పడి ఉండడం తనకు ఇష్టం లేదని,అంతగా తానేం తప్పు చేశానో తనకు అంత చిక్కడం లేదని ఆయన అన్నారు.

ఒకవేళ నిజంగానే చేస్తే అది చెప్తే బాగుంటుందని ఆయన చెప్పారు.అది మాట్లాడడానికైనా కనీసం అపాయింట్మెంట్ దొరకటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మిగిలిపోయిన చపాతీ పిండిని ఫ్రిడ్జ్ లో ఉంచి ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!