వరల్డ్ కప్ టోర్నీలో పాక్ ఓడిపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పకున్న బాబర్ అజమ్..!!

వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు సరైన ప్రదర్శన కనుపరచలేదు.9 మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ ఐదు మ్యాచ్ లు ఓడిపోవడం జరిగింది.

ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్టుపై కూడా పాక్ వరల్డ్ కప్ టోర్నీలో ఓటమి చెందటం అందరికీ షాక్ ఇచ్చింది.

అసలు ఏమాత్రం ఆశించిన రీతిలో పాకిస్తాన్ టీం రాణించలేకపోయింది.అంతేకాదు టీంలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయని.

మొదటి నుండి విమర్శలు వస్తున్నాయి.కెప్టెన్ బాబర్ అజమ్ బ్యాటింగ్ ఫార్మేట్ లలో కూడా సరిగ్గా రాణించలేకపోయాడు.

"""/" /   9 మ్యాచ్‌లలో 320 పరుగులు చేసిన బాబర్.వ్యక్తిగత సగటు 40 కాగా, స్ట్రైక్ రేట్ 82.

90.వరల్డ్ కప్ టోర్నీలో పాక్ క్రికెట్ అభిమానులను ఎంతగానో నిరాశపరిచాడు.

జట్టును నాకౌట్‌కు తీసుకెళ్లడంలో బాబర్ అజమ్ పూర్తిగా విఫలమయ్యాడు.దీంతో సోషల్ మీడియా వేదికగా అన్ని ఫార్మాట్‌ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

అంతేకాదు కొత్త కెప్టెన్ కి అంకిత భావంతో సహాయ సహకారాలు అందిస్తా.ఆటగాడిగా పాకిస్తాన్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తా.

ఇది చాలా కష్టమైన నిర్ణయం.కానీ ఇదే సరైన నిర్ణయం అని బాబర్ అజమ్ స్పష్టం చేయడం జరిగింది.

దీంతో పాకిస్తాన్ జట్టుకి తరువాత కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..?