బాబర్‌లో ఈ కోణం కూడా ఉంది.. అంపైర్‌తో ఎలా పరాచకాలు ఆడాడో చూడండి!
TeluguStop.com
ప్రస్తుతం ముల్తాన్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది.అయితే రెండో టెస్టులో 2వ రోజు అంపైర్ మరైస్ ఎరాస్మస్‌తో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ పరాచకాలు ఆడాడు.
అసలేం జరిగిందంటే, ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న ఒకరోజు బాబర్ అజామ్ బ్యాటింగ్ చేస్తూ అంపైర్ పక్కన నిల్చున్నాడు.
అయితే పక్కపక్కనే ఉన్న వీరిద్దరిని కెమెరామ్యాన్ చూపించడం మొదలుపెట్టాడు.అప్పుడు అంపైర్ కనిపించకపోగా అతడి పొట్ట మాత్రమే కనిపించింది.
ఆ పొట్ట అనేది బాబర్ అజామ్‌కి వచ్చినట్లుగా కనిపించడంతో వెంటనే నెటిజన్లు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి రచ్చ రచ్చ చేశారు.
కాగా ఆ మీమ్ రీక్రియేట్ చేయడానికి బాబర్ అజామ్ మళ్లీ ఆ అంపైర్ పక్కన నిల్చున్నాడు.
ఇది గ్రహించిన అంపైర్ మరైస్ ఎరాస్మస్ తన పొట్ట గట్టిగా ముందుకు నెడుతూ కనిపించాడు.
అది చూసిన ఒప్పుకోలేక బాబర్ ఆ అబ్బాయి పొట్టపై చిన్నగా కొట్టాడు.ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ కనిపించారు.
వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సన్నివేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి క్రికెట్ ఫ్యాన్స్ బాగా నవ్వుకుంటున్నారు.
ఈ వీడియోను పాకిస్థాన్ క్రికెటర్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా షేర్ చేసింది.దీనికి ఇప్పటికే రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వైరల్ వీడియోని మీరు కూడా చూసేయండి.
‘బైరవం’ సినిమాలో నారా రోహిత్ మంచు మనోజ్ క్యారెక్టర్లు ఏంటి..?