Baba : ఒక్క మంత్రంతో భక్తురాలి రోగాన్ని నయం చేసిన స్వామీజీ.. వీడియో వైరల్..
TeluguStop.com
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో స్వామీజీలు పూజారులు, చర్చి ఫాదర్లకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
వీటిలో ఆ స్వామీజీలు ఆరోగ్యంతో బాధపడుతున్న వారిని మంత్రాలతో లేదా ప్రేయర్లతో నయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
డాక్టర్( Doctor ) వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వీరి వద్దకు వెళ్తే సరిపోతుంది అని నెటిజన్లు ఈ వీడియోలను చూసి కామెంట్ చేస్తుంటారు.
మరి కొంతమంది ఈ స్వామీజీలు నిజంగా రోగాలను నయం చేస్తారా అని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.
"""/" /
తాజాగా గురు అమిత్ శర్మ( Amit Sharma) అనే మరో స్వామీజీ వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఆ వీడియోలలో స్వామీజీ సెకన్లలో ప్రజల వ్యాధులను నయం చేయగలనని చెబుతుండడం మనం వినవచ్చు.
అతను తన వద్దకు వచ్చిన ఎవరినీ ముట్టుకోరు లేదా వారికి మందులు ఇవ్వరు.
కానీ కేవలం కొన్ని మాటలు చెబుతాడు, అంతే, రోగంతో వచ్చిన ప్రజలు తాము ఇప్పుడు హెల్తీగా ఫీలవుతున్నామని చెబుతారు.
"""/" /
కొందరు ఆయనను నమ్ముతారు మరి కొందరు నమ్మరు.అయితే చాలా మంది అతని వీడియోలను చూస్తూ 'వైర్‌లెస్ వైద్యం' అని సరదాగా జోకులు చేస్తున్నారు.
ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో ఒక మహిలా భక్తురాలు తనకు జలుబు కారణంగా గొంతు నొప్పి( Sore Throat )గా ఉందని చెప్పింది.
పూజారి ఏదేదో చెప్పి ఆమె గొంతు మీద ఊదారు.అలా చేయడంతో ఆమె తన గొంతు బాగానే ఉందని చెప్పింది.
మరొక వీడియోలో, ఒక వ్యక్తి తనకు ఛాతీ నొప్పి అని చెప్పాడు.పూజారి అతనిని చొక్కా విప్పమని చెప్పి గాలి ఊదారు.
అలా చేయడంతో ఆ వ్యక్తి తన ఛాతీ బాధ పోయిందని చెప్పాడు.ఈ వీడియోలు కొంతమందికి చాలా ఫన్నీగా అనిపించాయి.
అందుకే వారు సోషల్ మీడియాలో వారిపై జోకులు వేస్తున్నారు.కంప్యూటర్‌ను రిమోట్‌గా ఫిక్స్ చేసినట్లే ఇతని వైద్యం కూడా ఉంటుంది అని ఒకరు అనగా.
ఆయన వైద్యంలో నోబెల్ బహుమతి పొందాలి.అని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఈ స్వామీజీకి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది, అక్కడ అతను తన వీడియోలను అప్‌లోడ్ చేస్తాడు.
దీనిని 'మా బగ్లాముఖి గుప్త దర్బార్' అంటారు.