చిరంజీవికి కట్టప్ప... లూసీఫర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన యూనిట్ సభ్యులు
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.ఆ వెంటనే లూసీఫర్ సినిమా రీమేక్ లో మెగా స్టార్ నటించబోతున్న విషయం తెల్సిందే.
అంచనాలు అందుకునేలా మెగా లూసీఫర్ ను మోహన్ రాజా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.ఈ సినిమా లో ప్రముఖ స్టార్స్ నటించబోతున్నారు.
తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రిప్ట్ ను మార్చారు అంటూ సమాచారం అందుతోంది.
తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు.
ఇక ఈ రీమేక్ లో బాహుబలి కట్టప్పను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కీలక సన్నివేశాల్లో కనిపించే ఒక పాత్రను సత్యరాజ్ తో చేయించబోతున్నాడు.
సినిమాలో ఆ పాత్ర చిరంజీవికి సపోర్టర్ గా ఉంటుందని అంటున్నారు. సత్యరాజ్ బాహుబలి తర్వాత టాలీవుడ్ లో చాలా ఫేమస్ అయ్యాడు.
ఈ తమిళ నటుడిని లూసీఫర్ రీమేక్ లో మంచి పాత్ర కోసం దర్శకుడు ఎంపిక చేయడం జరిగింది.
చిరంజీవితో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకునే పాత్ర దక్కడంతో సత్యరాజ్ చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
తప్పకుండా ఇది ఆయన కెరీర్ కు మరింతగా బూస్ట్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
లూసీఫర్ లో మోహన్ లాల్ పాత్ర కు ఒక సహయకుడి పాత్ర ఉంటుంది.
అంటే రాజకీయాల్లో కార్యకర్త తరహా పాత్ర.అలాంటి పాత్రను రీమేక్ లో సత్య రాజ్ వంటి స్టార్ తో చేయించడం తో సినిమాపై మరింతగా అంచనాలు ఆసక్తి పెరుగుతుందనే నమ్మకంను వ్యక్తం అవుతుంది.
లూసీఫర్ సినిమా లో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ అయితే ఇవ్వలేదు.
త్వరలోనే చిరంజీవి వేదాళం చిత్రం కూడా చేయబోతున్నాడు.అయితే లూసీఫర్ ముందు ఉంటుందని అంతా చెబుతున్నారు.
త్వరలోనే అన్ని విషయాలపై మెగా కాంపౌండ్ నుండి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఒక్క ఆమ్లెట్ ధర రూ.3,500.. మిచెలిన్ స్టార్ పీతల ఆమ్లెట్ తిన్న మనోడు.. ఏమన్నాడంటే?