బాల బాహుబలి 'బ్యాచ్' వచ్చేది ఎప్పుడంటే..!
TeluguStop.com
బాహుబలి, రేసుగుర్రం తో పాటు ఇంకా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో బాల నటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ హీరో గా పరిచయం అవుతున్న చిత్రం "బ్యాచ్ ".
బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై సాత్విక్ వర్మ ,నేహా పటాన్ జంటగా నటిస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచే ఈ సినిమా కు సంగీతం అందించినాడు .
ఈ చిత్రాన్ని ఈ నెల 18వ తారీకున భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు.
ఇప్పటికే ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
మొదటి పార్ట్ విడుదలకు సిద్దం అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ.యూత్ ని టార్గెట్ చేసి తీసిన చిత్రమిది.
బెట్టింగ్, మేల్ ప్రాస్ట్యూషన్ నేపథ్యంతో సాగే కథ తో ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందించాం.
రఘు కుంచే అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన దక్కించుకున్నాయి.
ఈ నెల 18 న విడుదలవుతున్న మా బ్యాచ్ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
"""/" /
చిత్ర నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ.ఇప్పుడున్న పరిస్థితుల్లో మా సినిమా బిజినెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.
ఇందులో నటించిన సీనియర్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా నటించారు.వారంతా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18 న వస్తున్న మా 'బ్యాచ్' సినిమా 100% హిట్టవుతుందనే నమ్మకం గట్టిగా ఉంది.
ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు.
వైరల్ వీడియో: పరాయి వ్యక్తితో ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కానిస్టేబుల్