బి వై నగర్, సుందరయ్య నగర్, ఇందిరానగర్,పద్మా నగర్, రాజీవ్ నగర్ లకు ప్రభుత్వం ఇచ్చిన నివేశ స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కి మున్సిపల్ చేసిన తీర్మానం తో పాటు కాలనీవాసుల సంతకాలతో కూడిన వినతి పత్రం.
సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్కార్మిక వాడలైన బద్దం ఎల్లారెడ్డి నగర్, సుందరయ్య నగర్, ఇంద్రానగర్, పద్మ నగర్, రాజీవ్ నగర్ లకు ప్రభుత్వం ఇచ్చిన నివేశస్థలాలకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని ఈ రోజు బీవై నగర్ జండా చౌరస్తా వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేసిన సంతకాలతో కూడిన వినతి పత్రం సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి అందించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి ఈ సమస్య తన దృష్టిలో ఉన్నది గత ప్రభుత్వాన్ని సమస్యను పరిష్కారం చేయవలసి ఉండే కానీ చేయకుండా ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయడం జరిగింది.
నేను ఈ సమస్యను పరిష్కారానికి కృషి చేస్తాను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మంత్రి వద్దకు ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని అన్నారు.
గత 45 సంవత్సరాల క్రితం బి వై నగర్ లో పేద ప్రజలకు నివేశ స్థలాలు ప్రభుత్వం అందించడం జరిగింది.
ఇన్ని సంవత్సరాలు అయితున్న కూడా సిరిసిల్ల పట్టణంలో పేదలకు ఇచ్చినటువంటి నివేశ స్థలాలకు సొంత భూమి తరహా రిజిస్ట్రేషన్ హక్కులు లేకపోవడంతో ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రజల అవసర నిమిత్తం ఇంటి నిర్మాణం చేసుకుంటాం అనుకుంటే సొంత భూమికానందన ప్రభుత్వ భూమి కింద పరిగణించి ఎలాంటి రుణం ప్రభుత్వ బ్యాంకులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా సొంతభూమి కింద ఉంటున్న.నివేశ స్థలాన్ని పరిగణించకుండా ఇంకా ప్రభుత్వం కిందనే చూస్తున్నారు ఈ విషయంపై ప్రజలు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి మొర పెట్టుకోవడం జరిగింది పట్టణం అభివృద్ధి జరుగుతున్న కూడా కార్మిక వాడల్లో అభివృద్ధి జరగకపోవడానికి ప్రధాన కారణం రిజిస్ట్రేషన్ హక్కులు లేకపోవడం మూలంగానే కార్మిక వాడలు వెనక బాటుకు గురవుతున్నాయి.
సిరిసిల్ల పట్టణ కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవంగా రిజిస్ట్రేషన్ జరుపుకోవడానికి వీలు కల్పిస్తూ తీర్మానాలు కూడా జరిగిన కానీ ప్రభుత్వం జీవో ఇవ్వకపోవడంతో ఈ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది ఇప్పటికైనా మున్సిపాల్ లో కౌన్సిలర్ తీర్మానాన్ని పరిగణంలో తీసుకొని ప్రజల కష్టాలను ప్రభుత్వం గుర్తించి వెంటనే సొంత భూమి కింద రిజిస్ట్రేషన్ చేసుకుని హక్కులు కల్పించాలని సిపిఎం కోరుతున్నది.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, అన్నల్ దాస్ గణేష్ పాల్గొన్నారు.
ఇండియన్ బీచ్‌లో తెల్లతోలు పిల్ల దోపిడీ.. సెల్ఫీకి రూ.100 వసూలు చేస్తూ అడ్డంగా దొరికింది..