ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

సూర్యాపేట జిల్లా:ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హైవే ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యాపేట-ఖమ్మం 365 బిబి జాతీయ రహదారిపై సింగరేణిపల్లి టోల్ ప్లాజా వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ హాజరై మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ జాయింట్ అడ్వైజర్ కె.ఎస్.

రెడ్డి,సూర్యాపేట జిల్లా ఫారెస్ట్ అధికారి జి.ముకుందరెడ్డి,ఎఫ్ఆర్ఓ గౌతమ్,సూర్యాపేట బీట్ ఆఫీసర్ మాచర్ల అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

వేసవిలోనూ జలుబు వేధిస్తుందా.. అయితే ఇలా చేయండి!