ఎన్టీఆర్ భవన్‌లో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌లు

హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ భవన్‌లో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఈ వేడుక‌ల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు.దేశంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన పీవీ న‌రసింహారావు, జెండా రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్యను యువ‌త గుర్తు చేసుకోవాల‌న్నారు.

దివంగ‌త నేత ఎన్టీఆర్ తీసుకొచ్చిన పాల‌సీలు దేశానికి మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచాయ‌ని కొనియాడిన ఆయ‌న‌.

హైవేలు, ఐటీ, ఇరిగేషన్, తాగు‌నీరు సహా.పెను విప్లవాలకు తెలుగుదేశం నాంది పలికిందన్నారు.

అదేవిధంగా జాతి అభివృద్ధికి నాటి ప్ర‌ధాని నెహ్రూ నుంచి నేటి ప్ర‌ధాని మోదీ చేసిన సేవ‌లు కీల‌క‌మ‌ని వ్యాఖ్య‌నించారు.

గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయబోయి సింహాల చేతిలో హతమైన జూకీపర్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!