అయ్యన్న పాత్రుడిని చట్టపరంగా పోలీసులు అరెస్ట్ చేశారు..డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

టీడీపీ నేతలకు ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయాడిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడురాష్ట్ర డిప్యూటీ సీఎం, పంచాయితీరాజ్ శాఖ మంత్రి శ్రీ బూడి ముత్యాలనాయుడు ప్రెస్ మీట్ సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేస్తే.

దొంగపనులకు టీడీపీ లైసెన్స్ లు ఇచ్చిందా పంట కాలువను ఆక్రమించిన అయ్యన్నపాత్రుడికి టీడీపీ, ఎల్లో మీడియా మద్దతా.

తప్పుడు పనులు చేసే అయ్యన్నపాత్రుడు బీసీలకు మహానాయకుడా.బీసీల తోకలు కత్తిరిస్తానన్నవారు బీసీ అనుకూలురు అవుతారా.

టీడీపీలోని దోపిడీ దొంగలంతా అయన్నపాత్రుడికి మద్దతిస్తున్నారు.అచ్చెన్న, అయ్యన్నలు మాత్రమే బీసీలు కాదు.

తప్పుడు పనులు చేసిన అయ్యన్నపాత్రుడి అరెస్టును బీసీలంతా సమర్థిస్తున్నారు.బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలంతా వైఎస్ఆర్సీపీ వైపే.

డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.ఇంకా ఏమన్నారంటే.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో కోర్టును తప్పుదారి పట్టించిన అయ్యన్న నేరస్థుడు కాదా.తప్పుడు పనులు చేసిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడిని చట్టపరంగా పోలీసులు అరెస్ట్ చేశారు.

నీటి పారుదల శాఖకు చెందిన స్థలంలో ఇంటి కాంపౌండ్ వాల్ కట్టడం తప్పని తెలిసి కూడా అధికారం మీ చేతుల్లో ఉందనే అహంకారంతో అప్పుడు తీసుకున్న నిర్ణయాలపై వాస్తవాలు బయటకు వచ్చాయి.

హైకోర్టుకు సమర్పించిన పత్రాలను కూడా ఫోర్జరీ చేశారనే విషయాన్ని ప్రాధమిక దర్యాప్తులో తేలడంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

దానికి, టీడీపీ నేతలు, అయ్యన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనిని విమర్శలు చేయడం విడ్డూరం.

రాజకీయాల్లో కనీస పరిజ్ఞానం లేని ప్రతిపక్ష నాయకుడు కుమారుడు నారా లోకేష్ కూడా వాస్తవాలేమిటో తెలుసుకోకుండా.

పులి - పిల్లి అని మాట్లాడుతున్నాడు.పులి ఎవరో, పిల్లి ఎవరో అనేదానిపై రాష్ట్ర ప్రజలు ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

మిమ్మల్ని ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు.టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, అపార అనుభవం ఉందని చెప్పుకునే అయ్యన్నపాత్రుడు నీటి పారుదల శాఖకు చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకోవడం, మళ్లీ చేసిన తప్పును బుకాయిస్తూ, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి హైకోర్టును సైతం తప్పుదారి పట్టించడం ఎంతవరకూ సమంజసం?.

హైకోర్టులో తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించిన అయ్యన్న అరెస్ట్ ను బీసీలకు అంటగట్టడం ఎంతవరకూ కరెక్ట్.

?దొంగ పనులు చేసిన అయ్యన్నను అరెస్టు చేస్తే బీసీలకు ద్రోహం చేసినట్టా.దొంగ పనులు చేసి, దొరికిపోయిన అయ్యన్నపాత్రుడి అరెస్ట్ ను బీసీలకు ముడిపెడుతూ, ఈ అరెస్ట్ వల్ల బీసీలకు తీరని అన్యాయం జరిగినట్లు టీడీపీ నేతలు మాట్లాడటం దౌర్భాగ్యం.

అయ్యన్న మాత్రమే బీసీ నాయకుడు కాదు.బీసీల్లో పరిపాలనా దక్షత, బీసీల అభ్యున్నతికోసం పాటుపడే నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు.

అయ్యన్నపాత్రుడి అరెస్ట్ తో బీసీలకు అన్యాయం జరిగిందనేదానికి ఎలాంటి సంబంధం లేదు.అయ్యన్నపాత్రుడి అరెస్టను బీసీలకు చేసిన ద్రోహంగా టీడీపీ చిత్రీకరించటం సిగ్గుచేటు.

చట్టానికి లోబడి అయ్యన్నపాత్రుడిపై ఎఫ్ఐఆర్ నమోదు అయిన నాన్ బెయిల్ బుల్ సెక్షన్లకు అనుగుణంగానే సీఐడీ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు.

చట్టం ఎవరికీ చుట్టం కాదు.తప్పు చేసినవాళ్లు ఎంతటివాళ్లు అయినా చట్టం, కోర్టులు శిక్షిస్తాయి.

తప్పుడు పనులు చేసినవారికి మద్దతుగా టీడీపీ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయడం సరికాదు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు టీడీపీ నాయకుల్ని అన్యాయంగా అరెస్ట్ లు చేయిస్తున్నాడంటూ చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు.

దొంగ సంతకాలు పెట్టి తప్పుడు పత్రాలు సమర్పించి అయ్యన్నపాత్రుడు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.

ఆ పత్రాలను ఫోర్జరీ చేశారని సీఐడీ ధ్రువీకరించిన తర్వాతే అయ్యన్నను అరెస్ట్ చేశారు.

టీడీపీ హయాంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అయ్యన్న ఇలాంటి దొంగ పనులు చేయవచ్చా? లేక అప్పటి మీ ప్రభుత్వం వీటికి ఏమైనా లైసెన్స్ లు ఇచ్చిందా?.

మాఫియా డాన్ లా అయ్యన్నపాత్రుడి ప్రవర్తనఅయ్యన్నపాత్రుడిని చట్టబద్ధంగా అరెస్ట్ చేసినా కొన్ని ఎల్లో పత్రికలు,టీవీ ఛానల్స్ తప్పులు చేసిన అయ్యన్నను సమర్థించడం ఎంతవరకూ సమంజసం.

?.అరెస్టు సమయంలో అయ్యన్నపాత్రుడి వీడియోలు చూస్తే.

ఒక మాఫియా డాన్ ఎప్పుడూ గూండాలను చుట్టుపెట్టుకుని, ఒక డెన్ లో ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు.

ఒక మాఫియా డాన్ పోలీసులను చూసి, ఎలా బెదిరిస్తాడో, అలాగే బెదిరించాడు.పోలీసులను మీ అంతు చూస్తాను అని బెదిరించినవాడిని చట్టానికి కట్టుబడ్డ వ్యక్తి అంటారా.

లేక.యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారా.

?.అయ్యన్న చేసిన తప్పుకు అయ్యన్నే బాధ్యుడు కావాలి కానీ, మొత్తం బీసీలకు ఆపాదిస్తామంటే ఎలా?.

టీడీపీ హయాంలో అధికారం అడ్డం పెట్టుకుని దోచుకుంటే, నీ కుటుంబం మాత్రమే బాగుపడుతుంది తప్ప రాష్ట్రంలో బీసీలు బాగుపడ్డారా?.

అయ్యన్నపాత్రుడు అధికారంలో ఉండగా బీసీలకు మంచి చేద్దామనే కనీస ఆలోచన అయినా చేశాడా?.

బీసీలు గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు, తాము అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారనేది చెప్పగలరా?.

బీసీ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అమలు చేసేందుకు మా ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ తరఫున కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకుంది వాస్తవం కాదా?.

అది బీసీలకు అన్యాయం చేసినట్లా? న్యాయం చేసినట్లా?.తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన బీసీలను తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు మాట్లాడింది నిజం కాదా?.

అయ్యన్న అరెస్ట్ ను అడ్డుపెట్టుకుని లబ్ది పొందాలని చూస్తే.బీసీలు ఎవరూ నమ్మరు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది.

రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపేవాళ్లు, టీవీల్లో మాట్లాడేవాళ్లంతా టీడీపీ దోపిడీ దొంగలే.

బీసీలకు అన్యాయం జరిగిందంటూ మీకు మద్దతుగా వచ్చేవాళ్లు ఎవరూ లేరు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా వైఎస్ఆర్సీపీ వైపే.

రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు వైయస్సార్ సీపీకి అండగా ఉంటూ, గడిచిన ఎన్నికలలో 151 స్థానాలను కట్టబెట్టారు.

అదే టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది.జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక కుల,మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతోంది.2014-19కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టి, మీరు చేసిన దోపిడీ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగదీసి, ఇప్పుడు అయ్యన్నకు మద్దతుగా వస్తున్నారు.

మీ అయిదేళ్ల పాలనలో చేసిన తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు పనులే.ఇతరులు కూడా చేస్తారనుకుంటే అది మీ భ్రమ.

తప్పులు చేసినవారు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్యాయంగా ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి వేధించింది.

అదే మా ప్రభుత్వం తప్పు చేసిన వారు ఎవరైనా, న్యాయంగా, చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే, ఆ రాజ్యాంగం, చట్టాలు తమకు వర్తించవన్నట్టుగా టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.

వారికేమయినా ప్రత్యేక చట్టం ఉందాఫోర్జరీలు చేసేవాడు సంఘ సేవకుడా.విశాఖ భూములపై తాము ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారంటున్న టీడీపీ నాయకుల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

నీటి పారుదల శాఖకు చెందిన భూములు ఆక్రమించుకోరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి.

చేసిన తప్పును అయ్యన్న ఇప్పటికైనా అంగీకరిస్తే మంచిది.తప్పు చేశారని నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందే.

ఒకవేళ తప్పు చేయకుంటే నిరూపించుకోవాల్సిన బాధ్యత అయ్యన్నపాత్రుడిపైనే ఉంది.ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా.

?.దొంగ సంతకాలు పెట్టి డాక్యుమెంట్లు తారుమారు చేసిన వ్యక్తి దేశ భక్తుడా లేక తెలుగుదేశం భక్తుడా.

?.ఆయన్ను సమర్థిస్తున్న టీడీపీ వాళ్లు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి.

దూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, యనమల రామక`ష్ణుడు, దేవినేని ఉమ.

వీళ్లంతా ఏమైనా సంఘ సేవకులా?.వీళ్లంతా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న దొంగల ముఠా సభ్యులు, దోపిడీదారులు.

ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబు.చంద్రబాబు, ఆయన కొడుకుతో కలిసి వీళ్ళంతా రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు.

బీసీలకు తీరని అన్యాయం చేశారు.రాష్ట్ర సంపదను అంతా దోచుకున్నారు.

వీళ్ళా మా ప్రభుత్వం గురించి విమర్శించేది.నారా లోకేష్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని మా అధినేత జగన్ గారు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైయస్సార్ సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

దీనిమీద కూడా సీఐడీ పోలీసులు దృష్టి సారించి, చర్యలు తీసుకోవాలి.మహిళలపై బూతుల మాట్లాడితే కేసులు నమోదు చేయరా?.

అచ్చెన్న, అయ్యన్నలే బీసీలు కాదుమీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.అచ్చెన్నాయుడు, అయ్యన్నే బీసీలు కాదు.

రాష్ట్రంలో చాలామంది బీసీ నాయకులు ఉన్నారు.ఎన్నికల్లో ఓట్ల కోసం బీసీలకు మోసపూరిత హామీలు ఇచ్చి, ఆ తర్వాత చంద్రబాబు బీసీలకు ద్రోహం చేశాడు కాబట్టే గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు.

నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఎన్నో అక్రమాలు చేశారు.బీసీలను అడ్డం పెట్టుకుని టీడీపీలో గెలిచిన బీసీ నాయకులు కూడా పదవులు పొంది వాళ్లు మాత్రమే ఆర్థికంగా లబ్ది పొందారే తప్ప బీసీలకు చేసిందేమీ లేదు.

అయ్యన్నపాత్రుడి అరెస్టును బీసీలంతా సమర్థిస్తున్నారు.జగన్ మోహన్ రెడ్డిగారి వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించారు కాబట్టే వైయస్సార్ సీపీకి బీసీలంతా అండగా ఉన్నారు.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు శాచురేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.

అన్నివర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల చదివేలా అమ్మ ఒడి మొదలు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అందిస్తున్నాం.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలలో పేదరికం పోవాలంటే విద్య ద్వారానే అని గ్రహించిన ముఖ్యమంత్రిగారు తల్లిదండ్రులపై భారం పడకుండా పేద విద్యార్థులకు కొండంత భరోసా ఇస్తున్నారు.

గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ విషయంలో డిస్సాపాయింట్ అయిన మెగా అభిమానులు…