బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్స్ తినకూడదని చెబుతున్న ఆయుర్వేద శాస్త్రం.. ఎందుకో తెలుసా?
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దాదాపు అందరూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటారు.
బ్రేక్ ఫాస్ట్ ను వదిలేస్తే ఆ రోజంతా ఏదో లోటుగా ఉంటుంది.చాలామందిలో కొంతమంది తమ బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా తాజా పండ్లు, జ్యూస్ తీసుకుంటూ ఉంటారు.
పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ అల్పాహారంలో పండ్లు తీసుకోవడం మంచిది కాదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
కాలీ కడుపుతో పండ్లు తినడం వల్ల చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యకాలంలో కఫా కాలం అని అంటారు.
అందుకే ఈ టైంలో ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదని చెబుతూ ఉంటారు.పండ్లు పుల్లగా, తీపి లాంటి ఎన్నో రుచులతో ఉంటాయి.
పండ్లలో సాధారణ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.ఇవి త్వరగా జీర్ణం అవుతాయి.
వీటిలో కఫ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.పరిగడుపున వీటిని తినడం వల్ల కఫ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్స్ తీసుకోవద్దని చెప్పేందుకు ముఖ్య కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం సమయంలో జీర్ణ క్రియ తక్కువగా ఉంటుంది.చల్లని ఆహారాలు దాన్ని మరింత తగ్గిస్తాయి.
మనం తీసుకునే అల్పాహారం వెచ్చగా సులభంగా జీర్ణం అయ్యేదిగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
లేదంటే ఒక గ్లాస్ పాలలో చిటికెడు సొంటిపొడి వేసుకొని తాగడం కూడా మంచిదే.
చాలామంది తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు భాగం చేసుకుంటుంటారు.వీరిలో ఇది ఒక అలవాటుగా మారిపోయి ఉంటుంది.
కొంతమందికి బలమైన జీర్ణశక్తి ఉంటుంది.వాళ్ళు పండ్లు తీసుకున్న ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
"""/"/
బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా పండ్లు తినాలనుకునేవారు ఇలా చేయడం మంచిది.
అలాంటివారు దాల్చిన చెక్క లేదా సొంటి వంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం మంచిది.
అంతేకాకుండా వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు కూడా ఉదయం పూట పండ్లు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించి బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు తీసుకోవచ్చు.శరీరంలో ఏదైనా చెడు మార్పులు గమనిస్తే మాత్రం దీన్ని వెంటనే ఆపడం మంచిది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు భారీ స్థాయిలో క్రేజ్.. ఈ సీక్వెల్స్ హిట్టవుతాయా?