బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేసే ఆయుర్వేద చిట్కాలు ఇవే!

చ‌క్కెర వ్యాధి లేదా మ‌ధుమేహం.ఇటీవ‌ల రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందిలో స‌ర్వ సాధార‌ణంగా క‌నిపిస్తోన్న స‌మ‌స్య‌ ఇది.

ఒక్క సారి మ‌ధుమేహం బారిన ప‌డ్డారంటే.ఇక బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌డం క‌త్తి మీద సామే.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆయుర్వేద చిట్కాల‌ను పాటిస్తే గ‌నుక చాలా అంటే చాలా సుల‌భంగా ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ ఆయుర్వేద చిట్కాలు ఏంటో ఓ లుక్కేసేయండి.బిళ్ల గ‌న్నేరు పువ్వులు.

అలంక‌ర‌ణ‌కే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ఔష‌ధ గుణాలను క‌లిగి ఉండే బిళ్ల గ‌న్నేరు పువ్వులు మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు ఓ వ‌రంగా చెప్పుకోవ‌చ్చు.

అవును, ఒక క‌ప్పు నీటిలో రెండు లేదా మూడు బిళ్ల గ‌న్నేరు పువ్వులు వేసి బాగా మ‌రిగించి గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి.

ఇలా ప‌ర‌గ‌డుపున చేస్తే గ‌నుక బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి.అలాగే ఆయుర్వేద వైద్యంలో విరి విరిగా ఉప‌యోగించే తిప్ప‌తీగ కూడా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు చాలా మంచి చేస్తుంది.

"""/" / తిప్ప‌తీగ ఆకుల‌ను మెత్త‌గా నూరి ర‌సం తీసుకోవాలి.ఈ ర‌సాన్ని ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో ఒక స్పూన్ చొప్పున‌ సేవించాలి.

ఇలా చేస్తే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కంట్రోల్ అవ్వ‌డ‌మే కాదు.రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. """/" / దాల్చిన చెక్క‌కూ బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేసే సామ‌ర్థ్యం ఉంది.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి క‌లిపి బాగా మ‌రిగించి.

గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి.రోజూ ప‌ర‌గ‌డుపున ఇలా తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

నేను ఎవరికి భయపడే టైపు కాదు : వనిత విజయ్ కుమార్ కూతురు