రామాలయం కోసం 500 సంవత్సరాలుగా దీక్ష.. ఈ వంశీయుల శపథం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

అయోధ్యలోని రామమందిరంలో( Ayodhya Ram Mandir ) మరికొన్ని గంటలలో శ్రీరామచంద్రుడు కొలువుదీరనున్నారు.

అయోధ్యకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి స్పెషల్ రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు,( Chandrababu ) పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) మరి కొందరు రాజకీయ ప్రముఖులు అయోధ్యకు వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

అయోధ్య ప్రాణప్రతిష్టకు వచ్చే అతిథుల జాబితా ఇప్పటికే సిద్ధమైందని తెలుస్తోంది.అయితే ఒక వంశస్థులు రామాలయం కోసం 500 సంవత్సరాలుగా దీక్ష చేస్తుండగా ఈ వంశీయుల శపథం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వంశంలో ప్రస్తుతం నివశిస్తున్న వ్యక్తుల తాతలు, ముత్తాతలు కూడా రామాలయం ప్రారంభం అయ్యేవరకు తలపాగాలు( Turbans ) ధరించబోమని దీక్షపూనారు.

గత 5 శతాబ్దాలుగా తలపాగాలు వేసుకోకుండా ఈ కుటుంబం వార్తల్లో నిలవడం గమనార్హం.

"""/" / 500 సంవత్సరాల క్రితం అయోధ్యలో( Ayodhya ) రామ మందిరాన్ని కూల్చేయగా ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను నిరసిస్తూ సూర్యవంశీ ఠాకూర్ ల( Suryavanshi Thakur ) కుటుంబం తలపాగాలు తీసివేసింది.

ఆలయాన్ని కూల్చిన చోటే తిరిగి నిర్మించే వరకు తలపాగాలు ధరించబోమని ఆ కుటుంబం నిర్ణయం తీసుకోగా రామ మందిరం నిర్మాణంతో ఆ కుటుంబ సభ్యుల కోరిక నెరవేరింది.

"""/" / రామ మందిరం ప్రారంభానికి కొంత సమయం మాత్రమే ఉండటంతో సూర్యవంశీ ఠాకూర్ కుటుంబం దీక్షను ముగించింది.

తమది శ్రీరాముని వంశం అని ఆ కుటుంబం చెబుతోంది.సూర్యవంశీ ఠాకూర్ కుటుంబం చాలా సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరోవైపు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని మల్టీప్లెక్స్ లు బంపర్ ఆఫర్ ప్రకటించాయి.

100 రూపాయల టికెట్ తో రామ మందిరంలో రాముని ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ లో చూసే అవకాశం కల్పిస్తున్నాయి.

మల్టీప్లెక్స్ లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలు రేపు సెలవును ప్రకటించాయి.

పాక్ నటుడి నోట భారత మాట.. దీపక్ పెర్వానీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు..